ఆ తెలుగు హీట్ సినిమా రీమెక్ హక్కులను సొంతం చేసుకున్న బాలీవుడ్ టాప్ హీరో.. ఇంతకీ అతడెవరంటే..

గతేడాది విడుదైలన 'బ్రోచేవారెవరురా' క్రైమ్ కామెడి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీవిష్ణు హీరోగా, నివేద థామస్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు.

ఆ తెలుగు హీట్ సినిమా రీమెక్ హక్కులను సొంతం చేసుకున్న బాలీవుడ్ టాప్ హీరో.. ఇంతకీ అతడెవరంటే..
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 17, 2020 | 4:23 PM

గతేడాది విడుదైలన ‘బ్రోచేవారెవరురా’ క్రైమ్ కామెడి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీవిష్ణు హీరోగా, నివేద థామస్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అప్పట్లో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమెక్ చేయబోతున్నారు. బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవ్‏గణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తన సొంత బ్యానర్ పై చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు ఈ టాప్ హీరో. అయితే తెలుగులో సూపర్ హిట్ సాధించిన బ్రోచేవారెవరురా క్రైమ్ కామెడీ సినిమాను అజయ్ హిందీలోకి రిమేక్ చేయబోతున్నారట. ఈ సినిమాలో అభయ్ డియోల్, సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ఈ మూవీలో మెయిన్ రోల్‏లో నటించనున్నారు. కాగా అటు హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా సమాచారం.