జీవితం ప్రమాదంలో ఉంది, కాపాడండి: సీఎంకు ప్రముఖ దర్శకుడి అభ్యర్థన

కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామి తమిళనాడు సీఎంకు ఓ అభ్యర్థన పెట్టుకున్నారు. తన జీవితం ప్రమాదంలో ఉందని, కాపాడాలని ఆయన వెల్లడించారు.

జీవితం ప్రమాదంలో ఉంది, కాపాడండి: సీఎంకు ప్రముఖ దర్శకుడి అభ్యర్థన
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Oct 28, 2020 | 2:55 PM

Director request to CM: కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామి తమిళనాడు సీఎంకు ఓ అభ్యర్థన పెట్టుకున్నారు. తన జీవితం ప్రమాదంలో ఉందని, కాపాడాలని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే అందులో వివరాలు మాత్రం వెల్లడించలేదు.

కాగా శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవాలని కోరిన వారిలో రామస్వామి ఒకరు. అలా అన్నందుకు కొంతమంది నుంచి తనకు బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని ఆయన ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించారు. తనకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ గురించి తెలుసని, కానీ ఫిలిం ఇండస్ట్రీ వారు చేసే రాజకీయాల గురించి తెలీదని వివరించారు. విజయ్ సేతుపతికి, తనకు మధ్య శత్రుత్వం పెంచేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.(KBC 12: 40వేల ప్రశ్నకు అన్ని లైఫ్‌ లైన్లు వాడేశాడు.. ఇంతకు క్వశ్చన్ ఏంటంటే)

అయితే విజయ్ సేతుపతితో, రామ స్వామికి మంచి అనుబంధం ఉంది. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన ఐదు సినిమాలు విడుదల కాగా.. అందులో రెండింటిలో సేతుపతి నటించారు. అంతేకాదు సేతుపతితో ఆయన తెరకెక్కించిన మామనితన్‌ కొన్ని కారణాల వలన విడుదల కాకపోగా.. మరో మూవీ ఆగిపోయింది.(‘మన్నత్‌’ని అమ్మేస్తున్నారా.. కింగ్‌ఖాన్ రిప్లై అదుర్స్‌)

https://twitter.com/seenuramasamy/status/1321304921929637892

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu