‘కబీర్ సింగ్’ ‘బాహుబలి’ని బీట్ చేస్తాడా!
మరో తెలుగు దర్శకుడు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాడు. బాహుబలి సినిమాతో రాజమౌళి బాలీవుడ్ దర్శకులని భయపెట్టాడు. బాక్స్ ఆఫీస్ సునామీ అనే ఎలా ఉంటుందో రాజమౌళి చూపించాడు. ఇప్పుడు యువ దర్శకుడు సందీప్ వంగా.. బాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్సేషన్. అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయమైన వరంగల్ కుర్రాడు సందీప్ వంగా అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. షాహిద్ కపూర్‌కి ఇంతకముందు సోలో హీరోగా 15 […]

మరో తెలుగు దర్శకుడు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాడు. బాహుబలి సినిమాతో రాజమౌళి బాలీవుడ్ దర్శకులని భయపెట్టాడు. బాక్స్ ఆఫీస్ సునామీ అనే ఎలా ఉంటుందో రాజమౌళి చూపించాడు. ఇప్పుడు యువ దర్శకుడు సందీప్ వంగా.. బాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్సేషన్.
అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయమైన వరంగల్ కుర్రాడు సందీప్ వంగా అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. షాహిద్ కపూర్‌కి ఇంతకముందు సోలో హీరోగా 15 కోట్ల రూపాయల ఓపెనింగ్ లేదు. కానీ అతని కబీర్ సింగ్ చిత్రం ఇండియాలో ఏకంగా 20.21 కోట్ల రూపాయలను తొలి రోజు రాబట్టింది. ఇది సంచలనం.
చాలామంది ఫిల్మ్ క్రిటిక్స్.. కబీర్ సింగ్‌ని దారుణంగా విమర్శించారు. పురుషాధిక్య భావజాలంతో కూడిన సినిమా అని కామెంట్స్ చేశారు. రేటింగ్స్ గొప్పగా రాలేదు. కానీ యూత్‌కి చేరువ చేసింది. బాలీవుడ్‌లో ఇప్పటివరకు సందీప్ వంగా గురించి ఎవరికీ తెలియదు. షాహిద్ కపూర్.. బిగ్ స్టార్ కూడా కాదు. అయినా ఈ సినిమా అక్షయ్ కుమార్ సినిమాకి మించి వసూళ్లు అందుకోవడం అనేది సంచలనం. అందుకే ఇప్పుడు సందీప్ వంగా పేరు మారుమోగుతోంది.
అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన వెంటనే సందీప్ వంగా డైరెక్షన్‌లో నటించేందుకు రామ్ చరణ్, మహేష్ బాబు వంటి బడా హీరోలు ఆసక్తి చూపారు. అయితే వెంటనే డేట్స్ ఇవ్వలేదు. ఒక ఏడాది తర్వాత వర్క్ చేద్దామన్నారు. కానీ వంగా వెయిట్ చేయకుండా హిందీ రీమేక్ చేసి.. ఇప్పుడు బాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్‌గా మారాడు. ఈ సినిమా వంద కోట్ల మార్క్ దాటుతుందని అంచనా.
