ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమంతా సంపాదన ఏంటంటే..!

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్టులు పెట్టి వాటి ద్వారా ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీస్ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. కాగా తెలుగు హీరోయిన్ సమంతా కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్ లో ఆమెను 7.3 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 6.2 మిలియన్లు ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్ బుక్ విషయానికి వస్తే ఆమె పేజీకి 8.6 మిలియన్ల లైక్స్ ఉన్నాయి. ఇకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా సమంతా ఆర్జిస్తున్న ఆదాయం […]

  • Ravi Kiran
  • Publish Date - 7:24 pm, Thu, 21 March 19
ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమంతా సంపాదన ఏంటంటే..!

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్టులు పెట్టి వాటి ద్వారా ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీస్ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. కాగా తెలుగు హీరోయిన్ సమంతా కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్ లో ఆమెను 7.3 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 6.2 మిలియన్లు ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్ బుక్ విషయానికి వస్తే ఆమె పేజీకి 8.6 మిలియన్ల లైక్స్ ఉన్నాయి. ఇకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా సమంతా ఆర్జిస్తున్న ఆదాయం తెలిస్తే అందరూ షాక్ అవుతారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్ ద్వారా 15 లక్షలు సంపాదిస్తుందట. ఒక్కో పోస్ట్ కి ఎందుకు ఇంత పెద్ద మొత్తం అని ఆలోచిస్తున్నారా. మరేమి లేదండి. ఆమె ఒక్క పోస్ట్ పెడితే.. ఆ పోస్ట్ ని ఆమె ఫాలో అవుతున్న అందరూ చూస్తారు. దాని ద్వారా ఆ ప్రచార సంస్థలకు ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది. సో అందుకే ఈ పెద్ద మొత్తం. ఏది ఏమైనా సౌత్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎక్కువ సంపాదించేది ఈ అక్కినేని కోడలు మాత్రమే.