AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హిట్ సీక్వెల్ లో నాగ్ మళ్ళీ నటిస్తాడా..?

‘రాజు గారి గది’ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు ఓంకార్. ఈ సినిమా హిట్ అవడంతో.. దీనికి సీక్వెల్ గా ‘రాజు గారి గది 2’ తెరకెక్కించి మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నాగార్జున, సమంతా ప్రధాన పాత్రలు పోషించారు.  ఇప్పుడు తాజాగా ఈ సిరీస్ లో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట ఓంకార్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం మళ్ళీ అక్కినేని నాగార్జున సంప్రదించినట్లు […]

ఆ హిట్ సీక్వెల్ లో నాగ్ మళ్ళీ నటిస్తాడా..?
Ravi Kiran
|

Updated on: Mar 21, 2019 | 6:05 PM

Share

‘రాజు గారి గది’ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు ఓంకార్. ఈ సినిమా హిట్ అవడంతో.. దీనికి సీక్వెల్ గా ‘రాజు గారి గది 2’ తెరకెక్కించి మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నాగార్జున, సమంతా ప్రధాన పాత్రలు పోషించారు.  ఇప్పుడు తాజాగా ఈ సిరీస్ లో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట ఓంకార్.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం మళ్ళీ అక్కినేని నాగార్జున సంప్రదించినట్లు వినికిడి. ఇక ఈ సినిమాలో నటించడానికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఓంకార్ ప్రస్తుతం మిగిలిన తారాగణం ఎవరనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.