హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగనుంది. మళ్లీ రావా మూవీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న జెర్సీలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది. హోళీ ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాలోని ‘అదేంటోగానీ ఉన్నపాటుగా..’ అనే పాట టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీం. ఇందులో నాని, శ్రద్ధా కెమిష్ట్రీ అదిరిపోయింది. నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది.