Salman Khan: సల్మాన్ ఖాన్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్‌బాస్ 15 సీజన్‌కు అన్ని వందల కోట్లా..!
Bigg Boss 15 Salman Khan Fees: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలు చేస్తూ
Bigg Boss 15 Salman Khan Fees: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే.. ఆయన ఏ సినిమాలో నటించినా.. పలు టాప్ షో లకు హోస్ట్‌గా వ్యవహరించినా అభిమానులు.. ఆసక్తితో వాటికోసం ఎదురుచూస్తుంటారు. ఈ అగ్ర హీరో కొన్నేళ్లుగా హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా హిందీలో మంచి సక్సెస్‌ను సాధించింది. ఇప్పటి వరకు పూర్తైన 14 సీజన్స్‌లలో సల్మాన్ ఖాన్ 11 సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది మాదిరిగానే సల్మాన్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు సినీ ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది.
ఈ క్రమంలో బిగ్‌బాస్ 15 సీజన్‌లో సల్మాన్ రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ సీజన్ 15కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం సల్మాన్ కళ్లు చెదిరే పారితోషకం అందుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సల్మాన్ ఖాన్ 15వ సీజన్‌లోని ఒక్కో ఎసిపోడ్‌కు సల్మాన్ ఖాన్.. రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నారు. అలా14 వారాలకు గాను 350 కోట్ల రూపాయలు వసూలు చేయనున్నట్లు సమాచారం. అంటే ప్రతీ వారానికి దాదాపు 25 కోట్లు వసూలు చేయనున్నట్లు తెలుస్తుంది. గతేడాదికి ఇప్పటికీ.. దాదాపు రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు పేర్కొంటున్నారు.
కాగా.. సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తే.. దాదాపు రూ. 50 కోట్లకుపైగా పారితోషకం అందుకుంటారు. 100రోజుల బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో ద్వారా పెద్ద మొత్తంలో క్యాష్ చేసుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది.
Also Read: