19ఏళ్ల తరువాత..

19ఏళ్ల తరువాత..

సల్మాన్ ఖాన్ నటించిన ‘కామోషి: ద మ్యూజికల్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు సంజయ్ లీలా బన్సాలీ. ఆ తరువాత సల్మాన్‌తోనే ‘హమ్ దిల్ దే చుకే సనమ్‌’ను తెరకెక్కించి మరో హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దాదాపు 19 సంవత్సరాల తరువాత ఈ కాంబో సెట్స్ మీదకు వెళుతోంది. సల్మాన్‌ఖాన్‌తో ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు బన్సాలీ. ఈ విషయంపై బన్సాలీ ప్రొడక్షన్స్ సీఈవో ప్రేర్నా సింగ్ మాట్లాడుతూ.. ‘‘అవును 19 సంవత్సరాల […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 23, 2019 | 10:33 AM

సల్మాన్ ఖాన్ నటించిన ‘కామోషి: ద మ్యూజికల్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు సంజయ్ లీలా బన్సాలీ. ఆ తరువాత సల్మాన్‌తోనే ‘హమ్ దిల్ దే చుకే సనమ్‌’ను తెరకెక్కించి మరో హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దాదాపు 19 సంవత్సరాల తరువాత ఈ కాంబో సెట్స్ మీదకు వెళుతోంది. సల్మాన్‌ఖాన్‌తో ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు బన్సాలీ.

ఈ విషయంపై బన్సాలీ ప్రొడక్షన్స్ సీఈవో ప్రేర్నా సింగ్ మాట్లాడుతూ.. ‘‘అవును 19 సంవత్సరాల తరువాత సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు’’ అంటూ స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రాన్ని సల్మాన్, సంజయ్ సంయుక్తంగా నిర్మించనుండగా.. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ప్రస్తుతం భారత్‌లో నటిస్తున్న సల్మాన్ తరువాత దబాంగ్‌ 3లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే బన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ నటించనున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu