రజనీ మూవీపై ఇంట్రస్టింగ్ న్యూస్

రజనీ మూవీపై ఇంట్రస్టింగ్ న్యూస్

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మొదటిసారిగా పనిచేయబోతున్నాడు మురగదాస్. క్రేజీ కాంబోగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన రోజు నుంచే కోలీవుడ్‌లో అంచనాలు మొదలయ్యాయి. ఈ మూవీ విశేషాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు. అందులో ఒకటి పోలీస్ పాత్ర కాగా.. మరొకటి సామాజిక కార్యకర్త అని తెలుస్తోంది. ఈ రెండు […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:20 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మొదటిసారిగా పనిచేయబోతున్నాడు మురగదాస్. క్రేజీ కాంబోగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన రోజు నుంచే కోలీవుడ్‌లో అంచనాలు మొదలయ్యాయి. ఈ మూవీ విశేషాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు. అందులో ఒకటి పోలీస్ పాత్ర కాగా.. మరొకటి సామాజిక కార్యకర్త అని తెలుస్తోంది. ఈ రెండు పాత్రలతో మంచి సామాజిక సందేశాన్ని ప్రేక్షకులకు చూపించనున్నాడు. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నయనతార కనిపించనున్నట్లు టాక్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu