కన్నడ చిత్రంలో సాయి పల్లవి..?
తెలుగు, తమిళ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి తాజాగా ఒక కన్నడ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వం వహించనున్నాడట. కాగా దర్శకుడు ప్రేమ్ తాజా మీడియా ఇంటర్వ్యూ లో ‘తను తీయబోయే చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి ను ఎంపిక చేసినట్లు తెలిపారు’. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని స్వయంగా ప్రేమ్ నిర్మించనున్నాడట. మరోవైపు ఈ […]

తెలుగు, తమిళ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి తాజాగా ఒక కన్నడ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వం వహించనున్నాడట.
కాగా దర్శకుడు ప్రేమ్ తాజా మీడియా ఇంటర్వ్యూ లో ‘తను తీయబోయే చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి ను ఎంపిక చేసినట్లు తెలిపారు’. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని స్వయంగా ప్రేమ్ నిర్మించనున్నాడట. మరోవైపు ఈ సినిమాలో హీరోగా తన బావను పరిచయం చేయనున్నాడు దర్శకుడు ప్రేమ్.




