AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డియర్ కామ్రేడ్’… నో లిప్ లాక్!

సావిత్రి, సౌందర్యలాంటి హీరోయిన్లు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేసి.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటి హీరోయిన్లు కూడా వారిలా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తామంటే కుదరదు. గ్లామర్ షో చేస్తేనే ఈకాలం హీరోయిన్లకు వరుస ఆఫర్స్ వస్తాయి. ఇది ఇలా ఉంటే మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి మాత్రం దీనికి విరుద్ధంగా చేస్తుందని చెప్పాలి. ఇటీవలే ఆమె నటించిన ‘మారి 2’ సినిమాలో ‘రౌడీ బేబీ’ పాట సోషల్ మీడియాలో 200 […]

'డియర్ కామ్రేడ్'... నో లిప్ లాక్!
Ravi Kiran
|

Updated on: Jul 18, 2019 | 9:30 PM

Share

సావిత్రి, సౌందర్యలాంటి హీరోయిన్లు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేసి.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటి హీరోయిన్లు కూడా వారిలా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తామంటే కుదరదు. గ్లామర్ షో చేస్తేనే ఈకాలం హీరోయిన్లకు వరుస ఆఫర్స్ వస్తాయి. ఇది ఇలా ఉంటే మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి మాత్రం దీనికి విరుద్ధంగా చేస్తుందని చెప్పాలి. ఇటీవలే ఆమె నటించిన ‘మారి 2’ సినిమాలో ‘రౌడీ బేబీ’ పాట సోషల్ మీడియాలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిన సంగతి తెలిసిందే. అదీ కూడా సాయి పల్లవి కేవలం తన స్టెప్పులతోనే సాధించింది.

ఇది ఇలా ఉండగా సాయి పల్లవికి హిట్స్ సంఖ్య ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది. ఇటీవల ఆమె సూర్యతో నటించిన ‘ఎన్జీకే’ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. నిజానికి సాయి పల్లవి క్రేజ్‌కు పెద్ద ప్రాజెక్టులు ఆమె వద్దకు వస్తున్నప్పటికీ కేవలం తను పెట్టుకున్న పరిమితుల వల్లే అవి మిస్ అవుతోందని ఇన్‌సైడ్ టాక్. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు మొదట హీరోయిన్‌గా సాయి పల్లవినే అనుకున్నారట. కానీ కథ ప్రకారం లిప్ లాక్ సీన్స్ ఉంటాయని దర్శకుడు చెప్పడంతో నో చెప్పిందని సమాచారం. అటు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకు కూడా ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవినే.. కానీ అనుకోని విధంగా రష్మికను తీసుకున్నారు. సాయి పల్లవి మాత్రం తప్పుకోడానికి కారణాలు ఏంటి అనేవి తెలియాల్సి ఉంది.

Follow Us