AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజేతగా చెప్తున్నా!.. జెన్యూన్‌ సెలక్షన్ – కౌశల్ మంద

హైదరాబాద్‌: సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌పై వస్తున్న కాస్టింగ్ కౌచ్ తదితర ఆరోపణలపై ఆ షో సీజన్‌ 2 విజేత, నటుడు కౌశల్‌ మంద స్పందించారు. ఈ కార్యక్రమం అనైతికంగా ఉందని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా… మరోవైపు ఈ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్‌ ముఖర్జీపై సినీ నటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై వేరువేరు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కౌశల్‌ […]

విజేతగా చెప్తున్నా!.. జెన్యూన్‌ సెలక్షన్ - కౌశల్ మంద
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 18, 2019 | 3:27 PM

Share

హైదరాబాద్‌: సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌పై వస్తున్న కాస్టింగ్ కౌచ్ తదితర ఆరోపణలపై ఆ షో సీజన్‌ 2 విజేత, నటుడు కౌశల్‌ మంద స్పందించారు. ఈ కార్యక్రమం అనైతికంగా ఉందని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా… మరోవైపు ఈ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్‌ ముఖర్జీపై సినీ నటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై వేరువేరు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కౌశల్‌ బిగ్‌బాస్‌ గురించి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘బిగ్‌బాస్‌ 2 విజేతగా, ఓ సామాన్య పౌరుడిగా నాకు ఈ కార్యక్రమంపై ఎంతో గౌరవం ఉంది. ఈ కార్యక్రమం, ఎంపిక చేసే ప్రక్రియ ఎంతో నిజాయతీగా ఉంటాయని నాకు తెలుసు. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొనబోయే వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు రైడ్‌ ఎక్కబోతున్నారు’ అని పేర్కొన్నారు. మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

Follow Us