ఆ విమర్శలకు సమాధానమే ‘చిత్రలహరి’

ఆ విమర్శలకు సమాధానమే ‘చిత్రలహరి’

‘సుప్రీం’ తరువాత రెండు హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో ఢీలా పడ్డ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరిలో నటిస్తున్నాడు. కల్యాణి ప్రియదర్వన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్. ‘‘తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే కథగా.. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రలహరి ఉంటుంది. బలమైన కథాకథనాలతో, అనూహ్యమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 16, 2019 | 2:40 PM

‘సుప్రీం’ తరువాత రెండు హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో ఢీలా పడ్డ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరిలో నటిస్తున్నాడు. కల్యాణి ప్రియదర్వన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.

‘‘తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే కథగా.. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రలహరి ఉంటుంది. బలమైన కథాకథనాలతో, అనూహ్యమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నిరుద్యోగ యువతకు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. దేవీ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వరుస పరాజయాలతో నన్ను విమర్శించిన వారికి ఈ సినిమా సమాధానం చెబుతుంది’’ అంటూ సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మి్స్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu