సోనూకు సీతనే దిక్కు

సోనూకు సీతనే దిక్కు

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి తెలుగుతెరపైకి వస్తున్నాడు నటుడు సోనూ సూద్. విలన్ గా సోనూసూద్ పరిచయంలేని వ్యక్తి, అరుంధతి సినిమాతో ఫుల్ స్టార్ దమ్ పెంచేసుకున్నాడు సోనూ. కామెడీ విలన్ గా కూడా సోనూ బాగా ఎంటర్ టైన్ చేశాడు. అయితే.. శ్రీనువైట్ల ఆగడు దెబ్బకి టాలీవుడ్ కి దూరమైన సోనూ.. ప్రస్తుతం తేజ డైరెక్షన్ ‘సీత’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో సక్సెస్ అయితే మరోసారి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 16, 2019 | 2:58 PM

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి తెలుగుతెరపైకి వస్తున్నాడు నటుడు సోనూ సూద్. విలన్ గా సోనూసూద్ పరిచయంలేని వ్యక్తి, అరుంధతి సినిమాతో ఫుల్ స్టార్ దమ్ పెంచేసుకున్నాడు సోనూ. కామెడీ విలన్ గా కూడా సోనూ బాగా ఎంటర్ టైన్ చేశాడు. అయితే.. శ్రీనువైట్ల ఆగడు దెబ్బకి టాలీవుడ్ కి దూరమైన సోనూ.. ప్రస్తుతం తేజ డైరెక్షన్ ‘సీత’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో సక్సెస్ అయితే మరోసారి టాలీవుడ్ లో చక్రం తిప్పాలని చూస్తున్నాడట.

కాగా.. ప్రస్తుతం సోనూ కేరీర్ పరంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా ఇప్పుడు కాస్త ఇబ్బందిలోనే ఉన్నాడని టాక్. కాగా మణికర్ణిక సినిమా విషయంలో కూడా వివాదాల నేపథ్యంలో ఆ సినిమాకి కాల్ షీట్స్ ఇచ్చి నష్టపోయాడు సోనూ. ఇలాంటి టైంలో సోనూకు సీత సినిమా ఆఫర్ రావడంతో కాస్త ఊరట కలిగించే విషయమే. తేజ కూడా తన సినిమాలో విలన్ కి ఒక కొత్త రోల్ ను పరిచయం చేస్తూంటాడు. ఈ విధంగా అయినా సోనూకు మళ్లీ కలిసి వస్తుందో చూడాలి. ఈ సినిమాలో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ కలిసి నటిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu