S.P.KODANDAPANI : తెలుగుపాటకు స్పీడ్‌ పెంచిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి.

సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి అంటే ఈ తరానికి పెద్దగా తెలిసుండకపోవచ్చు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మొట్టమొదటగా సినిమా పాట పాడించింది ఆయనే అంటే ఓహో అని తలాడిస్తారేమో !

S.P.KODANDAPANI : తెలుగుపాటకు స్పీడ్‌ పెంచిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి.
S Pkodandapani He Is The Master Of Newest Tunes
Follow us
Balu

|

Updated on: Apr 05, 2021 | 1:30 PM

S.P.KODANDAPANI :సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి అంటే ఈ తరానికి పెద్దగా తెలిసుండకపోవచ్చు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మొట్టమొదటగా సినిమా పాట పాడించింది ఆయనే అంటే ఓహో అని తలాడిస్తారేమో ! ఇక కోదండపాణి పాటల గురించి, ఆయన చేసిన ప్రయోగాల గురించి ఏం తెలుస్తుంది? ఆ మాటకొస్తే ఇంతకు ముందు తరం వారికి కూడా తెలిసి ఉంటుందని అనుకోలేం! ఎందుకంటే కోదండపాణి చేసిన సినిమాలు తక్కువ..! కాకపోతే తెలుగు పాటను స్పీడువైపుకు మళ్లించింది మాత్రం కచ్చితంగా కోదండపాణే! అలాగని మెలోడీకి ఎప్పుడూ దూరం కాలేదు. హుషారు గీతాలు. శృంగార గీతాలు. విషాద గీతాలు. భక్తి గీతాలు అన్ని చేశారాయన. అన్నింటిలోనూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఇవాళ ఆయన వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయన గురించి కాసింత తెలుసుకుందాం!

సంగీత దర్శకుడిగా శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణికి మొదటి చిత్రం కన్నకొడుకు. 1961లో వచ్చిందీ సినిమా. రెండేళ్ల తర్వాత వచ్చిన గురువును మించిన శిష్యుడు చిత్రమే కోదండపాణిని ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ సినిమాలోని ఏడేడు జన్మల నుండీ పడివుందీ బ్రహ్మముడి, బలె బలె బలె హిరణ్యకశపుడిరా నిన్ను ఇరుచుకుతింటారా, వెన్నెల్లో కనుగీటేతారక వంటి పాటలను ప్రేక్షకులు మరీ మరీ విన్నారు. విని విని ఆనందపడ్డారు. కాకపోతే ఒక్కసారి ఓ ఇమేజ్‌ వచ్చాక దాన్నుంచి బయటపడటం ఒకింత కష్టమే! పాపం కోదండపాణికీ ఇది తప్పలేదు. గురువును మించిన శిష్యుడు తర్వాత జానపద చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే గుర్తింపు వచ్చింది. అయితేనేం, వాటిల్లోనూ తనదైన మార్క్‌ను చూపించాడు. ఇక బంగారు తిమ్మరాజు, తోటలోపిల్ల కోటలో రాణి, ఆకాశరామన్న, జ్వాలాదీప రహస్యం, భూలోకంలో యమలోకం, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, ఇద్దరు మొనగాళ్లు, గోపాలుడు-భూపాలుడు, మహాబలుడు. ఇలా జానపద చిత్రాలు వరుసపెట్టి వచ్చాయి. వాటిల్లో అందమైన వరసలతో బాణీలు కట్టి వారెవ్వా కోదండపాణి అనిపించుకున్నాడు. సాంఘీకచిత్రాల్లోనూ కోదండపాణిది స్పెషల్‌ స్టయిల్‌. ప్రతి పాటలో ఆయన మార్క్‌ కొట్టొచ్చినట్టు కనబడేది. చెవులకు ఇంపుగా వినబడేది. దేవతనే తీసుకోండి. ఎంతో చక్కటి పాటలనిచ్చాడాయన.

సుఖదు:ఖాలు, ఇంటిగౌరవం, మంచి కుటుంబం, మా మంచి అక్కయ్య, మంచి మిత్రులు, కీలుబొమ్మలు, ఆస్తులు అంతస్తులు, ఒకే కుటుంబం, శాంతి నిలయం, పండంటి కాపురం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలు. కోదండపాణి చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. విషాద గీతాలకే తప్ప శృంగార గీతాలకు అంతగా ఉపయోగించని శివరంజని రాగచ్ఛాయలలో నేనంటే నేనేలోని చాలదా ఈ చోటు పాటను, ఆస్తులు అంతస్తులులోని ఒకటై పోదామా ఊహల వాహినిలో పాటను స్వరపరచి ఔరా అనిపించుకున్నాడు. ఎవరూ అంతగా ముట్టుకోని సరస్వతి రాగాన్ని శ్రీరామకథ సినిమాలోని సర్వ కళాసారాము పాటకు ఉపయోగించి శాస్త్రీయ సంగీతంలో తన పట్టును నిరూపించుకున్నాడు. అలాగే కళ్యాణ వసంత రాగంలో అదే సినిమాలోని మాధవా మాధవా పాటను స్వరపరిచారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో ఏమీ ఈ వింత మోహం అన్న పాటలో వచ్చే నా హృది పయనించు శృంగార రథమా అన్న చరణానికి కామవర్ధని రాగాన్ని వాడారాయన. భాగేశ్రీ, కళ్యాణి రాగాలను కలగలిపి కథానాయిక మొల్లలోని దొరవో ఎవరివో పాటను కంపోజ్‌ చేసి ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే గొప్ప గాయకుడిని మొదటిసారిగా పరిచయం చేసింది కోదండపాణే! అంతే కాదు జేసుదాసుతో మొట్టమొదటిసారిగా తెలుగులో (బంగారుతిమ్మరాజులో నిండు చందమామ) పాడించింది కూడా ఈయనే! నటుడైన పద్మనాభంతో దేవతలో నాపేరు దాందాసు పాటను పాడించాడు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత రేలంగితో మళ్లీ పాట పాడించిన ఘనత కూడా కోదండపాణిదే. ఈలపాటి రఘురామయ్యతో మొదటిసారిగా వేరే నటుడికి ప్లేబ్యాక్‌ పాడించాడు. అది హీరో కృష్ణ కావడం ఇంకా గొప్ప విశేషం. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలో కృష్ణకు ప్లేబ్యాక్‌ అందించింది ఈలపాటి రఘురామయ్యే!

గుంటూరులో జన్మించిన కోదండపాటి బాల్యమంతా అక్కడే గడిచింది. చిన్నప్పుడే పద్యాలు, పాటలు పాడేవారు. సంగీతం నేర్చుకున్న కోదండపాణి సినిమాల్లో అవకాశం కోసం మద్రాస్‌కు వెళ్లారు. అద్దేపల్లిరామారావు సంగీతంలో వచ్చిన నా ఇల్లు సినిమాలో కోరస్‌ పాడారు. ఆ తర్వాత సుసర్ల దక్షిణామూర్తి దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. సంతానం సినిమాలో ఓ పాట కూడా పాడారు. ఆ తర్వాత కె.వి. మహదేవన్‌ దగ్గర కూడా కొంతకాలం పని చేశారు. కన్నకొడుకు సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యారు. ఆనాటి హీరోలందరి సినిమాలకు సంగీతం ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన మంచి కుటుంబం సినిమాకు కోదండపాణినే మ్యూజిక్‌. అయితే అందులో నాగేశ్వరరావుకు పాటలు లేకపోవడం గమనార్హం. మొత్తం 101 సినిమాలకు సంగీతాన్ని అందించిన కోదండపాణి పి.లీల సంగీతాన్ని అందించిన చిన్నారి పాపలు సినిమాకు సంగీత పర్యవేక్షణ అందించారు. 42 ఏళ్ల వయసులోనే 1974, ఏప్రిల్‌ అయిదున కన్నుమూశారు. మరిన్ని చదవండి ఇక్కడ :లవ్‌ ఫెయిల్యూర్‌ బాధను భరిచడం చాల కష్టం..తన బ్రేకప్ గురించి చెప్పిన అంజలి.. : Anjali About Breakup video.

Ariyana Glory : ఇక పై కనిపించను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్ వీడియో..

ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవని, హోలీ పండుగకు ఆహ్వానం పలుకుతున్న భారతావని