Rashmika Mandanna : స్నేహితులతో సరదాగా సాగరతీరంలో లక్కీ బ్యూటీ రష్మిక .. వీడియో వైరల్
'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన. ఆతర్వాత 'గీతగోవిందం' సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా వరుస విజయాలను అందుకుంటున్న రష్మికకు ఏకంగా సుపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకుంది.
Rashmika Mandanna : ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన. ఆతర్వాత ‘గీతగోవిందం’ సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా వరుస విజయాలను అందుకుంటున్న రష్మికకు ఏకంగా సుపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకుంది. మహేష్ కు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించింది. ఈ సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. ఆతర్వాత యంగ్ హీరో నితిన్ తో ‘భీష్మ’ సినిమా చేసి సక్సెస్ సొంతం చేసుకుంది.
ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోను రాణించాలని చూస్తుంది. ‘మిషన్ మజ్ను’ సినిమా తో బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది రష్మిక. మరో వైపు అమితాబ్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రష్మిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్ళింది. అక్కడ సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి చేసిన సందడికి సంబంధించి వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
also read : Mahesh Babu : మహేష్ తో సినిమాకు సిద్దమైన నితిన్ దర్శకుడు.. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసిన వెంకీ కుడుములు.?
View this post on Instagram