AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిట్టిబాబు రీసౌండ్‌కు 8 ఏళ్లు: రామ్‌చరణ్‌, సమంత ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన మాస్టర్

రాంచరణ్‌ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూసేది ఆయన స్టైల్ కోసం. అప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో స్టైలిష్ లుక్స్, డాన్స్, యాక్షన్‌కు ప్రయారిటీ ఉండేది. వాటి కోసం ఫ్యాన్స్ ఎదురుచూసేవారు. సినిమాల్లో చరణ్ ధరించే కాస్ట్యూమ్స్ నుంచి అన్నీ స్టైల్‌కు ఐకాన్‌గా ఉండేవారు.

చిట్టిబాబు రీసౌండ్‌కు 8 ఏళ్లు: రామ్‌చరణ్‌, సమంత ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన మాస్టర్
Ram Charan Rangasthalam1
Nikhil
|

Updated on: Mar 30, 2026 | 8:00 AM

Share

చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన చెర్రీ.. చాలా తక్కువ టైంలోనే తన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చరణ్.. తర్వాత చేసిన సినిమాలతోనూ అభిమానులను అలరించారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో లెక్కల మాస్టారుగా పాపులర్ అయిన సుకుమార్‌‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చరణ్. రంగస్థలం టైటిల్‌తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అప్పటివరకు స్లైలిష్ లుక్‌లో కనిపించిన చరణ్‌ను డిఫరెంట్‌ లుక్‌లో పరిచయం చేశారు సుకుమార్. ఫస్ట్ లుక్‌ రిలీజ్ నుంచి చాలా మంది సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చరణ్ లుక్స్‌ చూసిన అభిమానులు కొత్తగా ఉందని ఆనందపడినా.. తమ హీరో ఇటువంటి క్యారెక్టర్‌‌లో నటిస్తున్నారా? రగ్గెడ్ లుక్, పంచె, పాత కాలం నాటి షర్ట్.. వీటన్నింటినీ మించి సినిమాలో హీరోకు చెవులు వినిపించవు.

నిర్ణయమే సాహసం..

ఇటువంటి కథకు చరణ్ కాకుండా ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరో ఎవరైనా సినిమా చేయాలంటే ఆలోచిస్తారు. కానీ సుకుమార్‌‌ మీద ఉన్న నమ్మకంతో చరణ్ ఓకే చెప్పారు. కట్ చేస్తే సినిమా సూపర్‌‌హిట్. అంతేనా.. ఫ్యాన్స్ ఊహించని విధంగా నటించిన చరణ్.. వారందరినీ ఆశ్చర్యపోయారు. సినిమా కథ, నడిపించిన తీరు.. సమంత, చరణ్ మధ్య సన్నివేశాలు, జగపతిబాబు నటన, ప్రకాష్‌రాజ్ నట విశ్వరూపం ఇవన్నీ కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి.

Ram Charan Rangasthalam

Ram Charan Rangasthalam

రంగస్థలం సినిమాలో చరణ్ నటనకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. కథలో వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలైట్. సినిమా హిట్‌కు సూపర్‌‌ హిట్ మ్యూజిక్‌ కూడా కారణం. అనసూయ, ఆది పినిశెట్టి, రాజీవ్ కనకాల తమ పాత్రలకు ప్రాణం పోశారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. 2018, మార్చి 30వ తేదీన రిలీజైన రంగస్థలం సినిమా విడుదలై ఈరోజుకి 8 ఏళ్లు పూర్తయ్యింది. ప్రస్తుతం రామ్ చరణ్‌.. గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా చరణ్‌ స్టార్ ఇమేజ్ మరింత పెంచాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చరణ్..

Follow Us
ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు.. ఈ తప్పులు చేస్తే కార్డు రద్దే!
ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు.. ఈ తప్పులు చేస్తే కార్డు రద్దే!
Rangasthalam: థియేటర్‌‌లో చిట్టిబాబు రీసౌండ్‌కు 8 ఏళ్లు
Rangasthalam: థియేటర్‌‌లో చిట్టిబాబు రీసౌండ్‌కు 8 ఏళ్లు
ప్లేట్ పట్టుకుని వెళ్తే భోజనం లేదు పోరా అన్నాడు.. ఆ తర్వాత.!
ప్లేట్ పట్టుకుని వెళ్తే భోజనం లేదు పోరా అన్నాడు.. ఆ తర్వాత.!
గర్ల్ ఫ్రెండ్ కోసం కోట్లు విలువ చేసే కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్
గర్ల్ ఫ్రెండ్ కోసం కోట్లు విలువ చేసే కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్
ఈసారి EAPCET 2026కు భారీగా తగ్గనున్న దరఖాస్తులు? ఎందుకంటే..
ఈసారి EAPCET 2026కు భారీగా తగ్గనున్న దరఖాస్తులు? ఎందుకంటే..
అమ్మ అయిన తర్వాత కియారాలో వచ్చిన మార్పులివే!
అమ్మ అయిన తర్వాత కియారాలో వచ్చిన మార్పులివే!
JEE Main 2026 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్
JEE Main 2026 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్
కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా
కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా
భార్యను పుట్టింటికి పంపాడు..ప్రేయసిని ఇంటికి పిలిచాడు..కట్‌చేస్తే
భార్యను పుట్టింటికి పంపాడు..ప్రేయసిని ఇంటికి పిలిచాడు..కట్‌చేస్తే
చట్టంగా మారిన పేరెంట్స్ బాధ్యత.. ఈ కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది
చట్టంగా మారిన పేరెంట్స్ బాధ్యత.. ఈ కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది