RangDe Trailer: ఆకట్టుకున్న రంగ్ దే మూవీ ట్రైలర్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న సినిమా
RangDe movie Trailer: యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
RangDe movie Trailer : యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం నితిన్‌కి 29వ సినిమా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.
ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. గతంలో నితిన్-రష్మిక మందన్నా జంటగా వచ్చిన ‘భీష్మ’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్‌లో వచ్చిన ‘చెక్’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బొల్తా పడింది. దీంతో నితిన్ ‘రంగ్‌దే’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మరోసారి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు నితిన్. ఇక ఈ సినిమా మార్చి 26వ తేదీన విడుదల కానుంది.
చిన్నపటినుంచి ఒకరంటే ఒకరికి పాడని ఇద్దరు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డారన్నది.. ఈ సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావాల్సినంత ఎమోషన్ కూడా ఉందని తెలుస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ ఈసినిమా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా పైన ఆసక్తిని పెంచింది. ఈ ట్రైలర్ పైన మీరు ఓ లుక్కెయండి..
also read :