Chaavu Kaburu Challaga Movie : ‘చావుకబురు చల్లగా’ మూవీని ఘోరంగా ట్రోల్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

యంగ్ హీరో కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కథ కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బస్తీబాలరాజుగా కార్తికేయ,

Chaavu Kaburu Challaga Movie : 'చావుకబురు చల్లగా' మూవీని ఘోరంగా ట్రోల్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
Chaavu Kaburu Challaga Movie
Follow us

|

Updated on: Mar 19, 2021 | 6:10 PM

Cyberabad Traffic Police : యంగ్ హీరో కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కథ కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బస్తీబాలరాజుగా కార్తికేయ, మల్లికగా అందాల భామ లావణ్య త్రిపాఠీ నటించారు. సీనియర్ హీరోయిన్ ఆమని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించరు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పోస్టర్స్ ద్వారా సైబరాబాద్ పోలీసులు ఏవైర్నెస్ చేసే ప్రయత్నం చేశారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా కొంతమంది అది పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దాంతో చావు కబురు చల్లగా సినిమానుంచి ఒక పోస్టర్ ను తీసుకొని సైబరాబాద్ పోలీసులు తమదైన శైలిలో ట్రోల్ చేశారు.

ఈ సినిమా పోస్టర్ లో హీరో కార్తికేయ హీరోయిన్ ను బైక్ పైన ఎక్కించుకొని వెళుతున్నట్టుగా ఉంది. అయితే ఈ పోస్టర్ లో హీరో తలకు హెల్మెట్ పెట్టుకోలేదు. పైగా బైక్ ట్యాంక్ పైన కూర్చొని నిర్లక్ష్యం గా బైక్ నడుపుతూ కనిపించడు. దాంతో ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హెల్మెట్ పెట్టుకొని సరిగ్గా నడిపితే ఎలాంటి కబురు వినాల్సిన పనిలేదు బస్తీ బలరాజుగారు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు పోలీసులను సపోర్ట్ చేస్తుంటే.. మరి కొందరు తమ అభిమాన హీరోను సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. “సార్ మరి ఆ వాహనాన్ని కి ఎంత చాలన్ వేస్తున్నారు.. హెల్మెట్ లేదు .. సరిగ్గా కూర్చొలెదు.. సైడ్ మిర్రర్ లేదు .. వెనకాల కుర్చున ఆమెకు హెల్మెట్ లేదు”. అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు పోలీసులు రూల్స్ పాటించని ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి సైబరాబాద్ పోలీసులు సినిమాలను బాగానే వాడుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు.

కార్తికేయ సినిమాను ట్రోల్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

మరిన్ని ఇక్కడ చదవండి :

Anasuya Bharadwaj : వయ్యారాలు వొలకబోసిన అందాల అనసూయ.. సోషల్ మీడియాలో వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్లు

Chaavu Kaburu Challaga Movie : చావు కబురు చల్లగా మూవీ రివ్యూ.. సరికొత్త కథతో ఆకట్టుకుంటున్న సినిమా