Taapsee Pannu : ఆసక్తికర కామెంట్స్ చేసిన తాప్సీ.. ఆ హీరోయిన్ ను ఉద్దేశించే అన్నదా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

తెలుగు తెరకు ఝుమ్మందినాదం సినిమాతో పరిచయమైన చిన్నది తాప్సీ పన్ను. ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ..దూసుకుపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటున్న సమయం లోనే

Taapsee Pannu : ఆసక్తికర కామెంట్స్ చేసిన తాప్సీ.. ఆ హీరోయిన్ ను ఉద్దేశించే అన్నదా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Taapsee Pannu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 19, 2021 | 6:07 PM

Taapsee Pannu : తెలుగు తెరకు ‘ఝుమ్మందినాదం’ సినిమాతో పరిచయమైన చిన్నది తాప్సీ. ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ..దూసుకుపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటున్న సమయంలోనే ఈ అమ్మడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ మంచి మంచి కథలను ఎంచుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది తాప్సీ.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది తాప్సీ. అలాగే తన పైన ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి సరైన సమాదానాలు చెప్తూ ఉంటుంది ఈ చిన్నది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది తాప్సీ. ఈ పోస్ట్ లో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోకి గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ రాసిన ఒక కొటేషన్ ను జత చేసింది. ‘నీపై విసిరే రాళ్ళను నువ్వు మైలురాళ్ళుగా మార్చుకో” అంటూ రాసుకొచ్చింది.

అయితే ఇటీవల తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరగడం, తన పైన హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిన విషయమే. వాటన్నింటికి సమాధానంగా తాప్సీ ఈ పోస్ట్ చేసిందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ప్రస్తుతం తాప్సీ ‘హసీన్ దిల్ రుబా’ ‘రశ్మీ రాకెట్’ ‘లూప్ లపేటా’ ‘శభాష్ మిథూ’ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. త్వరలోనే మంచి పాత్ర దక్కితే తెలుగులోనూ సినిమా చేయడానికి చూస్తుంది ఈ సొట్టబుగ్గల సుందరి.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని ఇక్కడ చదవండి :

Chaavu Kaburu Challaga Movie : ‘చావుకబురు చల్లగా’ మూవీని ఘోరంగా ట్రోల్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Anasuya Bharadwaj : వయ్యారాలు వొలకబోసిన అందాల అనసూయ.. సోషల్ మీడియాలో వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్లు