Rana Daggubati: రిషబ్ శెట్టి ఊర్లో రానా సందడి.. ఈ ఇద్దరితో పాటు ఆ హీరోయిన్ కూడా..

దగ్గుబాటి రానా తాజాగా రిషబ్ శెట్టిని కలిశారు. రిషబ్ తో కలిసి ఆయన కెరడి ప్రాంతంలో పర్యటించారు. కెరడి రిషబ్ శెట్టి స్వగ్రామం. ప్రస్తుతం ఆయన అక్కడ కాంతార ప్రీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గతంలో వచ్చిన కాంతార సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Rana Daggubati: రిషబ్ శెట్టి ఊర్లో రానా సందడి.. ఈ ఇద్దరితో పాటు ఆ హీరోయిన్ కూడా..
Rana, Rishab Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 21, 2024 | 3:49 PM

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కాంతారా సినిమాతో కన్నడభాషల్లోనే కాదు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ కాంతార సినిమాతో రిషబ్ మంచి అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు రిషబ్ శెట్టి కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో హనుమాన్ సినిమాతో విజయం అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు రిషబ్. ఇటీవలే విడుదలైన రిషబ్ శెట్టి లుక్ ప్రేక్షకులను మెప్పించింది.

ఇది కూడా చదవండి : OTT Web Series : ఓయమ్మో..! ఇదెక్కడి అరాచకం.. మరీ ఇంత బోల్డ్ సిరీసా..!! ఒంటరిగానే చూడాలి

ఇదిలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టిని దగ్గుబాటి రానా కలిశారు. రిషబ్ తో కలిసి సరదాగా గడిపారు రానా.. రిషబ్ చదువుకున్న స్కూల్స్, దేవాలయాలకు, బీచ్‌కి వెళ్లి సరదాగా గడిపారు రానా. రానా దగ్గుబాటి అమెజాన్ ప్రైమ్ కోసం ఓ టాక్ షో చేస్తున్నాడు. ఈ టాక్ షోలో స్టార్ నటులను ఇంటర్వ్యూ చేస్తున్నాడు రానా. ఇప్పుడు కర్ణాటకకు వచ్చి రిషబ్ శెట్టిని ఇంటర్వ్యూ చేశాడు రానా.

ఇది కూడా చదవండి :ప్రియుడితో కలిసి చిందులేసిన క్రేజీ బ్యూటీ.. కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు..

రిషబ్ శెట్టి ఇంటర్వ్యూ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.  రానా దగ్గుబాటి టాక్ షోలో రిషబ్ శెట్టితో పాటు నటి నేహా శెట్టి పాల్గొనుంది. నేహా శెట్టి కూడా రానా, రిషబ్ తో కలిసి కెరడి, ఉడిపి తదితర ప్రాంతాల చుట్టూ తిరిగింది. రిషబ్ శెట్టి చాలా నెలలుగా కెరడి, ఉడిపి గ్రామాల్లో ఉంటున్నారు. ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ షూటింగ్ ఎక్కువగా కెరడి, ఉడిపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో జరుగుతుంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కన్నడలోనే కాకుండా హిందీ, తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. రిషబ్ శెట్టికి తెలుగులో ఇప్పటికే రెండు పెద్ద అవకాశాలు వచ్చాయి. హిందీలోనూ ఛత్రపతి శివాజీ పాత్రను పోషించనున్నారు. ప్రస్తుతం రానా, రిషబ్ శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Year Ender 2024: రేయ్ ఎవర్రా మీరంతా..!! ఈ హీరోయిన్ కోసం గూగుల్‌లో తెగ గాలించారంట మావా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.