రానా యూట్యాబ్ చానెల్‌తో ఆ మ్యూజిక్ లేబుల్ సంస్థ ఒప్పందం.. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహిస్తాం అంటున్న హీరో..
ఇటీవల టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి సౌత్ బే పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో సెలబ్రెటీల
ఇటీవల టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి ‘సౌత్ బే’ పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో సెలబ్రెటీల ఇంటర్వ్యూలతోపాటు వర్తమాన విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు రానా. తాజాగా సౌత్ బే చానెల్ ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా ఉండేందుకు ప్రముఖ డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ బిలీవ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే విషయంపై రానా స్పందించారు.
“మా సౌత్ బేకు ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా ఉండేందుకు బిలీవ్ ఇండియా ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం వలన సౌత్ బే మరింతగా వ్యూస్స్ పొందుతుందని ఆశిస్తున్నాం. ఇందులో ప్రతిభ ఉన్న కొత్త కళాకారులకు అవకాశాలు ఇవ్వడం, కమర్షియల్ కంటెంట్ తయారు చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టనున్నాం” అంటూ రానా చెప్పుకొచ్చారు. ‘సౌత్ బేతో బిలీవ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిభ ఉన్న కొత్త వారిని, మ్యూజిక్ లేబుల్స్‌ను ప్రోత్సహించడం బిలీవ్ ఇండియా కార్యాచరణలో కీలకమైంది. సౌత్ బేతో ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం చేసుకోవడం ఇందులో భాగమే. దీనితో సంగీత ప్రపంచంలో కొత్త దారిని సృష్టించగలం అని నమ్ముతున్నాం’ అని బిలీవ్ ఇండియా డైరెక్టర్ కెజీవీ కిరణ్ కుమార్ అన్నారు.
Also Read: Megastar Chiranjeevi: ‘ఆచార్య’ ఆడియో రైట్స్ రికార్డ్స్.. భారీ డీల్ కుదుర్చుకున్న ఆదిత్య మ్యూజిక్..
మ్యూజిక్ సెట్టింగ్స్ చేసుకుంటున్న ‘కిలాడి’ .. మాస్ మహారాజా ఫ్యాన్స్‌కి అదిరిపోయే..