Ram Rao On Duty: స్వయంవరం సినిమాలో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న ఈ హీరో తన నటనతో ప్రేక్షకులను ఫిదా అయ్యారు. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన వేణు.. 2011లో వచ్చిన ‘మాయగాడు’ తర్వాత మళ్లీ వేణు హీరోగా కనిపించలేదు. 2012లో ‘దమ్ము’ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో నటించిన వేణు మళ్లీ వెండి తెరపై కనిపించలేదు.
అయితే తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘రామా రావు ఆన్ డ్యూటీ’తో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు వేణు. సీఐ మురళీ అనే పాత్రలో వేణు కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలై 29న విడుదల చేయనున్నారు. వేణు పాత్ర సినిమాకు హైలట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అందుకు తగ్గుట్లుగానే వేణు ఫస్ట్ లుక్ ఇంటెన్సివ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజాకు జోడిగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మరి వేణు రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Our favourite ever is back in a never before Powerful role 💥
Introducing #VenuThottempudi as CI Murali from #RamaRaoOnDuty 🔥#RamaRaoOnDutyOnJuly29@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @RTTeamWorks @LahariMusic pic.twitter.com/UEA49fEbRO
— 𝐑𝐚𝐦𝐚𝐫𝐚𝐨 𝐎𝐧 𝐃𝐮𝐭𝐲 📷 (@RamaraoOnDuty) July 6, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..