‘సైరా’ దర్శకుడితో రామ్ నెక్స్ట్ మూవీ..?
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని రామ్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం.

Ram Pothineni Next Movie: ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని రామ్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. రామ్..సురేందర్‌రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ కు గ్రీన్ ఇచ్చారని తెలుస్తోంది. ఓ కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని టాక్ నడుస్తుండగా.. చిత్రం సెట్స్‌పైకి వచ్చే ఏడాది మొదట్లో వెళ్తుందని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి మాస్ హిట్ అందుకున్నాడు కథానాయకుడు రామ్. త్వరలోనే ‘రెడ్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. నివేతా పేతురాజ్, మాళవిక శర్మలు హీరోయిన్స్ గా నటించారు. కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీనితో ‘రెడ్’ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
Also Read:
‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!
ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!
”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..
IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం.!




