మళ్లీ చెర్రీనే టాప్.. మహేశ్, ఎన్టీఆర్ నెక్ట్స్

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ మళ్లీ టాప్‌గా నిలిచాడు. మహేశ్, ఎన్టీఆర్‌లను వెనక్కి నెట్టేసి తన స్టామినాను నిరూపించాడు. మహా శివరాత్రి సందర్భంగా గతంలో హిట్ అయిన కొన్ని చిత్రాలను థియేటర్లలో స్పెషల్ షో వేశారు. వాటిలో ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’, ‘అరవింద సమేత’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘మహానటి’, ‘ఆర్‌ఎక్స్ 100’, ‘ఖైదీ నంబర్.150’ తదితర చిత్రాలు ఉన్నాయి. కాగా అన్నింటిలో ‘రంగస్థలం’ రూ.1,40,431 కలెక్ట్ చేయగా.. ‘భరత్ అనే నేను’ రూ.96,550.. ‘అరవింద సమేత’ […]

మళ్లీ చెర్రీనే టాప్.. మహేశ్, ఎన్టీఆర్ నెక్ట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2019 | 11:37 AM

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ మళ్లీ టాప్‌గా నిలిచాడు. మహేశ్, ఎన్టీఆర్‌లను వెనక్కి నెట్టేసి తన స్టామినాను నిరూపించాడు.

మహా శివరాత్రి సందర్భంగా గతంలో హిట్ అయిన కొన్ని చిత్రాలను థియేటర్లలో స్పెషల్ షో వేశారు. వాటిలో ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’, ‘అరవింద సమేత’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘మహానటి’, ‘ఆర్‌ఎక్స్ 100’, ‘ఖైదీ నంబర్.150’ తదితర చిత్రాలు ఉన్నాయి. కాగా అన్నింటిలో ‘రంగస్థలం’ రూ.1,40,431 కలెక్ట్ చేయగా.. ‘భరత్ అనే నేను’ రూ.96,550.. ‘అరవింద సమేత’ రూ.63,631 కలెక్ట్ చేసింది. దీంతో మరోసారి మహేశ్, ఎన్టీఆర్‌లపై పైచేయి సాధించాడు చెర్రీ. కాగా 2018లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ‘రంగస్థలం’ రామ్ చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.