చెర్రీకి గాయం.. ‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్‌కు బ్రేక్
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. ఇందుకోసం ఇటీవలే చిత్ర యూనిట్ అక్కడకు వెళ్లింది. అయితే ఈ షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయమైంది. దీంతో పుణె షెడ్యూల్‌ను రద్దు చేసింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా.. రామ్ చరణ్ కాలిమడమకు మంగళవారం చిన్న గాయం జరిగింది. అందుకే పుణె షెడ్యూల్‌ను […]

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. ఇందుకోసం ఇటీవలే చిత్ర యూనిట్ అక్కడకు వెళ్లింది. అయితే ఈ షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయమైంది. దీంతో పుణె షెడ్యూల్‌ను రద్దు చేసింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్ మీడియాలో వెల్లడించారు.
‘‘జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా.. రామ్ చరణ్ కాలిమడమకు మంగళవారం చిన్న గాయం జరిగింది. అందుకే పుణె షెడ్యూల్‌ను రద్దు చేస్తున్నాం. మూడు వారాల తరువాత మూవీ షూటింగ్‌ను మళ్లీ ప్రారంభిస్తాం’’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ పేర్కొంది. కాగా ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. రియల్ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.
We regret to mention that #RamCharan confronted a minor ankle injury while working out at the gym, yesterday. The pune schedule has been called off. Back to action in 3 weeks! #RRR
— RRR Movie (@RRRMovie) April 3, 2019



