AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్స్‌కు కూడా క్రెడిట్ ఇవ్వండి- కృతి సనన్‌

ముంబయి: బాలీవుడ్‌ నటులు కార్తిక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన చిత్రం ‘లుకా చుప్పి’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా హీరో కార్తిక్‌కు మాత్రమే దక్కుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది  హీరోయిన్ కృతి సనన్. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్యూలో తన అసహనాన్ని వ్యక్తం చేసింది.  ‘‘ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌ను కూడా గుర్తిస్తున్నారు. అలాంటిది ‘లుకా చుప్పి’ కేవలం కార్తిక్‌ వల్లే […]

హీరోయిన్స్‌కు కూడా క్రెడిట్ ఇవ్వండి- కృతి సనన్‌
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 03, 2019 | 5:10 PM

Share

ముంబయి: బాలీవుడ్‌ నటులు కార్తిక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన చిత్రం ‘లుకా చుప్పి’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా హీరో కార్తిక్‌కు మాత్రమే దక్కుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది  హీరోయిన్ కృతి సనన్. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్యూలో తన అసహనాన్ని వ్యక్తం చేసింది.  ‘‘ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌ను కూడా గుర్తిస్తున్నారు. అలాంటిది ‘లుకా చుప్పి’ కేవలం కార్తిక్‌ వల్లే విజయం సాధించిందని అనడం సరికాదు’’ అంటూ క‌ృతి సనన్ పేర్కొంది. ఒకవేళ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు అంత ప్రాధాన్యత లేకుండా హీరోనే లీడ్ రోల్‌లో నటించినప్పుడు అతనికి క్రెడిట్‌ ఇచ్చినా అందులో అర్థం ఉంటుందని ఆమె అభిప్రాయపడింది.  సినిమాను హీరో, హీరోయిన్లు తమ భుజాలపై మోసినప్పుడు ప్రశంసలు కూడా ఇద్దరికి దక్కాలని ఆమె కోరారు. ఇక రెమ్యునరేషన్ పరంగా.. డబ్బు ముఖ్యమే కానీ సినిమా చేయడానికి ప్రధాన కారణం అది కాదని ఆమె అన్నారు. గతంలో హీరో కంటే హీరోయిన్లే ఎక్కువ పారితోషికాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయంటూ కృతి చెప్పుకొచ్చింది.

Follow Us