షార్ట్ స్కర్ట్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాళవిక
02 May 2026
Pic credit - Instagram
Phani Ch
మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ ఫోటోస్ తో చూపు తిప్పుకోనీడకుండా చేస్తుంది.
ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక మోహనన్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
2013లో 'పట్టమ్ పోలే' మూవీతో కథానాయికగా పరిచయమైంది మాళవిక మోహనన్. ఆ తర్వాత నటించిన మలయాళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమిళంలో పేట, మాస్టర్ వంటి చిత్రాల నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో ఫస్ట్ మూవీ ప్రభాస్ తో అనగానే లక్కు కలిసొచ్చిందని అనుకున్నారంతా. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని ఉంటే మాళవిక మోహనన్ లెక్క మరోలా ఉండేదేమో అంటారు నెటిజన్లు
సినిమా ఆలస్యం అవడం, ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాకపోవడంతో రాజాసాబ్ తర్వాత మాళవికకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ప్రస్తుతం 2 తమిళ మూవీస్ తో బిజీగా ఉంది మాళవిక
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక.. రెగ్యులర్ గా తన టూర్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది అభిమానులను ఆకట్టుకుంటుంది