స్టార్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్.. రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత
Rajitha Chanti
Pic credit - Instagram
02 May 2026
టాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో మెరవాలని ప్రతి తెలుగమ్మాయి కలలు కంటుంది. కానీ, ఆ కల నిజం చేసుకోవడం అంత సులభం కాదు. బిగ్ బాస్ ఫేమ్ దివి విషయంలో అదే జరిగింది.
'బిగ్ బాస్' సీజన్ 4తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల తార దివి వైద్య. తాజాగా తన సినీ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి సంచలన విషయాలను పంచుకుంది.
మహారాజా రవితేజ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చి తృటిలో చేజారడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఒక్క రాత్రిలోనే ఆ ఛాన్స్ మిస్సైందని తెలిపింది.
గతంలో రవితేజ పక్కన హీరోయిన్‌గా నటించే గొప్ప అవకాశం వచ్చిందని.. అంతా ఖరారైందని అనుకుంటున్నప్పుడే, రాత్రికి రాత్రే తనను ఆ ప్రాజెక్ట్ నుండి తొలగించారని తెలిపింది.
తన స్థానంలో వేరే హీరోయిన్‌ని తీసుకున్నారని ఆమె వాపోయింది. ఆ క్షణం తనను ఎంతో బాధించిందని, ఆ రాత్రంతా కన్నీళ్లు పెట్టుకున్నానని దివి ఎమోషనల్ అయ్యింది.
ఆ బాధలో తాను ఏడుస్తూ ఒక స్పీచ్ కూడా రాసుకున్నానని గుర్తుచేసుకుని ఆవేదన చెందింది. దర్శకుడు హరీష్ శంకర్ తన గురువుగా భావిస్తానని చెప్పింది దివి.
ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో కనీసం ఒక్క సీన్ లోనైనా కనిపించాలని ఉందని తన కోరికను బయటపెట్టింది బిగ్ బాస్ ఫేమ్ దివి
ప్రస్తుతం దివి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం అటు ట్రెడిషనల్, ఇటు గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తుంది ఈ అమ్మడు.