Ram Charan Birthday : శంకర్‌ మూవీ నుంచి చెర్రీ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. స్టైలిష్‌, స్టన్నింగ్ లుక్‌లో రామ్‌ చరణ్‌.

రామ్‌ చరణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా మూవీకి సంబంధించి ఎట్టకేలకు అప్‌డేట్ వచ్చేసింది. మొన్నటి వరకు ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాకు 'గేమ్‌ చేంజర్‌' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేస్తూ..

Ram Charan Birthday : శంకర్‌ మూవీ నుంచి చెర్రీ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. స్టైలిష్‌, స్టన్నింగ్ లుక్‌లో రామ్‌ చరణ్‌.
Ram Charan
Follow us

|

Updated on: Mar 27, 2023 | 4:00 PM

రామ్‌ చరణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా మూవీకి సంబంధించి ఎట్టకేలకు అప్‌డేట్ వచ్చేసింది. మొన్నటి వరకు ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాకు ‘గేమ్‌ చేంజర్‌’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే మొదట టైటిల్‌ను మాత్రమే విడుదల చేసింది చిత్ర యూనిట్‌. టైటిల్‌ను రివీల్‌ చేస్తూ ఓ చిన్న వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్‌ చేసింది.

దీంతో రామ్‌ చరణ్‌ లుక్‌ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ కాస్త డీలా పడ్డారు. అయితే చిత్ర యూనిట్ మరికాసేపట్లోనే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేసింది. పవర్‌ ఫుల్‌ టైటిల్‌కు తగ్గట్లుగానే చెర్రీ లుక్‌ ఉండడంతో ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. బైక్‌పై స్టైలిష్‌ లుక్‌లో ఉన్న ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రామ్‌ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్ర యూనిట్‌.

ఇదిలా ఉంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నారన్న వార్తలు కూడా సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..