AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: ఆహాకు కొత్త సీ.ఈ.ఓ.. మూడేళ్లలో ఒరిజినల్ కంటెంట్ కోసం రూ.1000 కోట్ల ఇన్వెస్ట్..

ఈ క్రమంలోనే ఆహా తన కార్యనిర్వాహక బృందంలోనూ కొన్ని మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు కొత్త సీ.ఈ.ఓ వచ్చారు. ఇంతవరకూ సీఈవోగా ఉన్న అజిత్ ఠాకూర్ ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తన బాధ్యతలను నిర్వర్తిస్తారని తెలిపింది. ఆయన ఆధ్వర్యంలో ఆహా స్టూడియోస్ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన చేయనుంది.

Aha OTT: ఆహాకు కొత్త సీ.ఈ.ఓ.. మూడేళ్లలో ఒరిజినల్ కంటెంట్ కోసం రూ.1000 కోట్ల ఇన్వెస్ట్..
Aha Ott
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2023 | 4:00 PM

Share

వచ్చే మూడేళ్లలలో ఒరిజినల్ కంటెంట్ రూపొందించేందుకు తెలుగు ఓటీటీ సంస్థ ఆహా దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా..ఈ పెట్టుబడిలో దాదాపు 20%-30% వరకు సినిమాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగించబడుతుందని తెలిపింది. మిగిలిన 70%-80% పెట్టుబడి నూతన కంటెంట్ కోసం ఉపయోగించనున్నారని ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ తెలిపారు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఇటీవలే తమిళంలోనూ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరిన్ని భాషల్లోకి ఈ ఓటీటీ సంస్థ ప్రవేశించనుంది. అలాగే కొత్త జానర్ లో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆహా తన కార్యనిర్వాహక బృందంలోనూ కొన్ని మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు కొత్త సీ.ఈ.ఓ వచ్చారు. ఇంతవరకు సీఈవోగా ఉన్న అజిత్ ఠాకూర్ ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తన బాధ్యతలను నిర్వర్తిస్తారని తెలిపింది. ఆయన ఆధ్వర్యంలో ఆహా స్టూడియోస్ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన చేయనుంది.

అలాగే  ప్రముఖ పారిశ్రామిక వేత్త రవికాంత్ సబ్నవీస్ ను ఆహా కొత్త సీఈఓగా నియమించింది. ప్రస్తుతం తెలుగు డిజిటల్ ప్లాట్ ఫాంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది ఆహా. ఇప్పటివరకు తాము నాన్ ఫిక్షన్ చిత్రాలు.. రియాలిటీ షోస్ ఎక్కువగా చేశామని.. ఇండియాలోనే అన్ స్టాపబుల్ అత్యంత విజయంతమైన టాక్ షోలలో ఒకటిగా ఉందని.. అలాగే ఒరిజినల్ సినిమాలు రూపొందించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు అజిత్ ఠాకూర్.

ఇవి కూడా చదవండి

ఆహా ఓటీటీ సినీ ప్రియులు కోరుకునే విధంగా వెబ్ సిరీస్ నుంచి సినిమాలు.. గేమ్ షోస్ వరకు ప్రతి దానిలో మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు కొత్త సీఈఓ రవికాంత్. ఆహా ప్రారంభం నుంచి అజిత్ ఉన్నాడని.. తెలుగు ప్రేక్షకులు ఆదరించేవిధంగా ఆహాను నిర్మించాడని… ఇక ఇప్పుడు తమిళంలో ఆహా ఉనికి విస్తరించింది. అజిత్ ఠాకూర్ ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ప్రమోట్ చేయడంతోపాటు.. ఇప్పుడు కొత్త బాధ్యతలతో ఆహాకు మరింత మార్గదర్శకత్వం చేస్తారని అన్నారు అల్లు అరవింద్.