Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: అప్డేట్ వచ్చేసిందిరోయ్.. చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సంక్రాంతి పండక్కి గేమ్ ఛేంజర్ సినిమాతో అలరించిన చరణ్.. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.

Ram Charan: అప్డేట్ వచ్చేసిందిరోయ్.. చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది..
Ram Charan Rc16
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2025 | 7:32 PM

ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత చరణ్ ఆర్సీ 16 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోపై ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రేపు (మార్చి 27న) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి కచ్చితంగ అప్డేట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఆర్సీ 16 మేకర్స్.

చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మార్చి 27న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఆర్సీ 16 టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా మరో స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ లో చరణ్ ఫుల్ జుట్టు, గడ్డంతో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా క్రికెట్, రెజ్లింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివన్న కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పీల్ కొట్టేసిన న్యాయస్థానం..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పీల్ కొట్టేసిన న్యాయస్థానం..
దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
మీ ఇంట్లో గ్యాస్ స్టౌ మంట ఏ రంగులో ఉందో గమనించారా? డేంజర్ అలర్ట్
మీ ఇంట్లో గ్యాస్ స్టౌ మంట ఏ రంగులో ఉందో గమనించారా? డేంజర్ అలర్ట్
పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..
పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..
ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..
ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..
ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన
ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట
మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..
మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..