‘అల్లుడు శీను’తో ఆ ఇద్దరు..!

'అల్లుడు శీను'తో ఆ ఇద్దరు..!

ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడు తన రెండో సినిమాను యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు వినికిడి. ఇకపోతే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ను తీసుకునే ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారని టాక్ వినిపించగా.. అవన్నీ […]

Ravi Kiran

|

Feb 23, 2019 | 10:07 AM

ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడు తన రెండో సినిమాను యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు వినికిడి. ఇకపోతే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ను తీసుకునే ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారని టాక్ వినిపించగా.. అవన్నీ రూమర్స్ అని రాశి ఖన్నా ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతా ను ఎంపిక చేయాలనీ చూస్తోందట చిత్ర యూనిట్. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారట నిర్మాతలు.

బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ మూవీ ‘అల్లుడు శీను’ లో సమంతా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కాబట్టి సమంతా మరోసారి జోడి కట్టేందుకు అభ్యంతరం చెప్పదని నిర్మాతలు భావిస్తున్నారు. ఆమె ఓకే చెబితే.. రకుల్ ను స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రానుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu