‘రాజు గారి గది 3’ నుంచి తమన్నా వైదొలగడానికి కారణం అదేనా?
అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజు గారి గది 3’. మొదట ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైనా.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ‘రాజు గారి గది’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను హీరో అశ్విన్ బాబు మీడియాతో పంచుకున్నారు. […]

అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజు గారి గది 3’. మొదట ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైనా.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ‘రాజు గారి గది’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను హీరో అశ్విన్ బాబు మీడియాతో పంచుకున్నారు.
‘రాజు గారి గది’ సిరీస్‌లో పది పార్టులు ఉండొచ్చు…
‘రాజు గారి గది’ చిత్రాన్ని తీసేటప్పుడు ఫ్రాంచైజ్ గురించి అసలు ఆలోచించలేదని హీరో అశ్విన్ అన్నాడు. టెక్నీషియన్స్‌ను నమ్ముకుని తీసిన ఈ సినిమా హిట్ కావడంతో.. పార్ట్ 2 తెరకెక్కించామన్నాడు. అయితే మొదటి పార్ట్ కంటే.. రెండో దానిలో ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గిందని ప్రేక్షకులు భావించారు. కానీ, ఇప్పుడు వచ్చే ‘రాజు గారి గది 3’ సినిమాతో ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్టైన్ చేస్తామని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ ఇది హిట్ అయితే.. పార్ట్ 4 ఉండొచ్చని హింట్ ఇచ్చాడు.
‘రాజు గారి గది 3’ పక్కా మాస్ ఎంటర్టైనర్…
‘రాజు గారి గది’లో మెడికల్ మాఫియా, పార్ట్ 2లో శత్రుత్వం, ఇగో అనే అంశాలను చూపించాం. ఈ రెండు చిత్రాల మాదిరిగా ‘రాజు గారి గది 3’లో సోషల్ మెసేజ్ ఉండదు. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే రీతిలో ఈ మూవీని తెరకెక్కించామన్నారు.
తమన్నా వైదొలగడానికి కారణం అదే…
ఈ చిత్రానికి మొదట తమన్నానే ఎంపిక చేశాం. అయితే ఆమెకు డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అంతేకాక ఆమె కోసం రెండు షెడ్యూల్స్ కూడా వాయిదా వేశాం. ఇక చివరికి ఆమె స్థానంలో అవికా గోర్‌ను ఎంపిక చేశాం. మరోవైపు ఈ సినిమాలో అవికా అద్భుతంగా నటించిందని కొనియాడాడు.




