ఎట్టకేలకు రాజశేఖర్‌ ‘అర్జున’కు మోక్షం

హైదరాబాద్: ఎన్నో ఏళ్ల పాటు హిట్ కోసం ఎదురుచూసిన రాజశేఖర్‌కు ప్రవీణ్ సత్తారు గరుడ వేగతో మంచి సక్సస్‌ను ఇచ్చాడు. ఆ సినిమా రాజశేఖర్‌లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఆ జోష్ లోనే ఈ గ్యాప్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకోని రిలీజ్‌కాని సినిమాలను ఆడియెన్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  అందుకే అప్పుడప్పడే 2011లో తీసిన ‘అర్జున’ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు రాజేశేఖర్ అండ్ టీం. రాజశేఖర్‌ కథానాయకుడిగా కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం […]

ఎట్టకేలకు రాజశేఖర్‌ ‘అర్జున’కు మోక్షం
Ram Naramaneni

|

Mar 07, 2019 | 3:19 PM

హైదరాబాద్: ఎన్నో ఏళ్ల పాటు హిట్ కోసం ఎదురుచూసిన రాజశేఖర్‌కు ప్రవీణ్ సత్తారు గరుడ వేగతో మంచి సక్సస్‌ను ఇచ్చాడు. ఆ సినిమా రాజశేఖర్‌లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఆ జోష్ లోనే ఈ గ్యాప్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకోని రిలీజ్‌కాని సినిమాలను ఆడియెన్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  అందుకే అప్పుడప్పడే 2011లో తీసిన ‘అర్జున’ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు రాజేశేఖర్ అండ్ టీం.

రాజశేఖర్‌ కథానాయకుడిగా కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున’. మరియమ్‌ జకారియా కథానాయిక. పొలిటికల్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ పూర్తి కాగా, యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రాజశేఖర్‌ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి యువకుడి పాత్రకాగా, మరొకటి కాస్త వయసు పైబడని పాత్ర. ఇలాంటి పాత్రలు రాజశేఖర్‌ గతంలోనూ నటించి మెప్పించారు. మరి ఇందులో ఆయన‌ నటన ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 15 వరకూ ఆగాల్సిందే. మరోవైపు “అ’ మూవీ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ డైరక్షన్‌లో రాజశేఖర్‌ ‘కల్కి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu