AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేశ్‌కు ‘నో’ చెప్పిన సాయిపల్లవి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ చిత్రంలో నటించనున్నాడు. మహర్షి తరువాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుండగా.. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని సంప్రదించినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే తాజా సమచారం ప్రకారం ఈ ఆఫర్‌ను సాయి పల్లవి తిరస్కరించిందట. కారణాలు తెలీదు కానీ ఇందులో నటించనని సాయి పల్లవి చెప్పిందట. దీంతో మరో హీరోయిన్ వేటలో అనిల్ రావిపూడి పడ్డట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఆచితూచి స్క్రిప్ట్‌లను […]

మహేశ్‌కు ‘నో’ చెప్పిన సాయిపల్లవి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 3:20 PM

Share

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ చిత్రంలో నటించనున్నాడు. మహర్షి తరువాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుండగా.. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని సంప్రదించినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే తాజా సమచారం ప్రకారం ఈ ఆఫర్‌ను సాయి పల్లవి తిరస్కరించిందట. కారణాలు తెలీదు కానీ ఇందులో నటించనని సాయి పల్లవి చెప్పిందట. దీంతో మరో హీరోయిన్ వేటలో అనిల్ రావిపూడి పడ్డట్లు తెలుస్తోంది.

అయితే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఆచితూచి స్క్రిప్ట్‌లను సెలక్ట్ చేసుకుంటోంది సాయి పల్లవి. స్క్రిప్ట్ నచ్చకపోతే ఎంత స్టార్ హీరో సినిమాకు అయినా నో చెబుతుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలను ఆమె వదులుకొంది(ఆమె వదులుకున్న చాలా సినిమాలు పరాజయాలు అయ్యాయి. అది వేరే విషయం). ఇక ఇప్పుడు వరుసగా ఫ్లాప్‌లు రావడంతో తదుపరి కథలపై మరింత శ్రద్ధను పెట్టాలని ఆమె అనుకుంటున్నట్లు టాక్. కాగా మరోవైపు మహేశ్ కోసం సాయి పల్లవిని అనుకుంటున్నారని తెలిసిన ఆయన అభిమానులు ఆమెను వద్దంటూ కామెంట్లు పెట్టిన విషయం తెలిసిందే.

Follow Us