‘యాత్ర’పై దర్శకేంద్రుడు ప్రశంసలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’పై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ప్రశంసలు కురిపించాడు. ‘‘యాత్రను చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశికి, వారి చిత్ర యూనిట్‌కు నా కృతఙ్ఞతలు’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. కాగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌ […]

‘యాత్ర’పై దర్శకేంద్రుడు ప్రశంసలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’పై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ప్రశంసలు కురిపించాడు. ‘‘యాత్రను చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశికి, వారి చిత్ర యూనిట్‌కు నా కృతఙ్ఞతలు’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు.

కాగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌ సెలబ్రిటీలు స్పందించకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఉన్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రముఖులకు మనసు రాలేదంటూ కామెంట్లు పెట్టారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు కొందరు ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ‘యాత్ర’ను చూసిన మారుతి, సురేందర్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ సినిమాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Published On - 11:21 am, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu