విజయ్‌కి మద్దతిస్తూ.. విమర్శకులకు రాధిక స్ట్రాంగ్ కౌంటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తోన్న విషయం తెలిసిందే. 800 పేరుతో ఈ మూవీ తెరకెక్కబోతుండగా.. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల అయ్యింది.
Radhika Supports Vijay: శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తోన్న విషయం తెలిసిందే. 800 పేరుతో ఈ మూవీ తెరకెక్కబోతుండగా.. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల అయ్యింది. అప్పటి నుంచి విజయ్ సేతుపతిపై, దర్శకనిర్మాతలపై తమిళుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షేమ్ ఆన్ యు విజయ్ సేతుపతి, తమిళ ప్రజలు విజయ్ సేతుపతిని బ్యాన్ చేయండి అంటూ నెట్టింట హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. అంతేనా ప్రముఖ దర్శకుడు భారతీరాజా సహా పలు తమిళ సంఘాలు విజయ్ సేతుపతిని ఈ మూవీని తప్పుకోవాలంటూ సూచించారు. ఈ నేపథ్యంలో నటి రాధికా, విజయ్‌కి మద్దతను ఇచ్చారు.
ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లను చేశారు. ”విజయ్ సేతుపతిని ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించకండని చెబుతున్నారు. వారికి ఏం పనిలేదా..? హైదరాబాద్‌కి చెందిన సన్‌రైజర్స్‌కి మురళీధరన్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు కదా. మరి అలాగే ఆ టీమ్ తమిళనాడు రాజకీయ నాయకుడికి చెందింది. వాళ్లను ఎందుకు అడగరు. విజయ్ సేతుపతి ఒక నటుడు. నటుడిని, క్రికెటర్‌ని కలపకండి.
సన్‌రైజర్స్, సన్‌టీవీ ఓనర్లు కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ రాజకీయాలను, స్పోర్ట్స్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్‌ని వాళ్లు ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సినిమా పరిశ్రమ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎందుకు చూడలేకపోతోంది. ఏదో వివాదాన్ని సృష్టించడానికి నేను ట్వీట్ చేయలేదు. సినిమా ఇండస్ట్రీకి మద్దతుగా చేస్తున్నా. అందుకే సన్‌రైజర్స్ పేరును ప్రస్తావించా” అని రాధికా ట్వీట్లు చేశారు. కాగా ఎమ్మెస్ శ్రీపతి 800 మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
Read More:
కీర్తి సురేష్ బర్త్‌డే.. మహేష్ బాబు స్పెషల్ విషెస్
మరో సినిమాను ప్రకటించిన నాగశౌర్య
#muthaiyamuralitharan biopic &asking @VijaySethuOffl not to act?do these people hav no work??why not ask @SunRisers why he is the head coach, team belongs to a Tamilian with political affiliations?VSP is an actor, and do not curb an actor. VSP&cricket both don’t warrant nonsense
— Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020
The owners of #Sunrisers, & #SunTV, though they have political affiliations, all these decades they could distinctly & professionally handle politics, sports & entertainment with due credits. Why not our film industry look at entertainment away from political view point. 1/2
— Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020
my intention of that tweet was not to create any room for controversies but was to support the film industry and the connected artists within prejudices. That's why I brought in #Sunrisers name as a testimony of non biased, neutral and professional approach
— Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020