కీర్తి సురేష్‌ బర్త్‌డే.. మహేష్ బాబు స్పెషల్ విషెస్

మహానటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ ఇవాళ 28వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కీర్తి సురేష్‌ బర్త్‌డే.. మహేష్ బాబు స్పెషల్ విషెస్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2020 | 10:27 AM

Keerthy Suresh Birthday: మహానటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ ఇవాళ 28వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కీర్తి పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్‌ బాబు ఆమెకు స్పెషల్ విషెస్‌ని చెప్పి, సర్కారు వారి పాటలోకి ఆహ్వానించారు.

హ్యాపీ బర్త్‌డే కీర్తి. నిన్ను సర్కారు వారి పాటలోకి టీమ్ ఆహ్వానిస్తోంది. నీ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది అని మహేష్‌, కీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా సర్కారు వారి పాటకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌లో నటించబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.