Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Raj Kumar: అప్పుపై అభిమానంతో.. ఓ అభిమాని నివాళులర్పిస్తూ.. తిరుమల కొండకు పాదయాత్ర

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవించింది 46ఏళ్ళు మాత్రమే..  అయితే ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరంజీవి. పునీత్ మరణించి దాదాపు నెలరోజులు అవుతున్నా..

Puneeth Raj Kumar: అప్పుపై అభిమానంతో.. ఓ అభిమాని నివాళులర్పిస్తూ.. తిరుమల కొండకు పాదయాత్ర
Puneeth Raj Kumar Fan Nande
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2021 | 3:01 PM

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవించింది 46ఏళ్ళు మాత్రమే..  అయితే ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరంజీవి. పునీత్ మరణించి దాదాపు నెలరోజులు అవుతున్నా.. ఆయన లేరనే వార్తను ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మీద ఉన్న తమ అభిమానాన్ని వివిధ రూపాలుగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అప్పుని కన్నడ ప్రజలు ఎంతగా అభిమానించారు అన్నదానికి ఉదాహరణగా ఆయన పార్దీవ దేహాన్ని సందర్శనార్ధం వెళ్ళడానికి వచ్చినవారు విడిచిన చెప్పులే సాక్ష్యం అని చెప్పవచ్చు. ఇక తాజాగా మైసూరుకు చెందిన ఓ అభిమాని దివంగత హీరో అప్పు పై ఉన్న అభిమానాన్ని తనదైన శైలిలో చూపించుకున్నాడు.

పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని ఆగ్రహారకు చెందిన మసాజ్‌ నందీష్‌ త‌న అభిమాన హీరో హఠాన్మరణంతో ఆవేదనకు గురయ్యాడు. అంతేకాదు నందీష్ తన అభిమాన హీరో పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ  తిరుమల తిరుపతికి పాదయాత్ర చేపట్టారు.  అప్పుకి నివాళులర్పించడానికి నందీష్ మైసూరు నుండి తిరుపతికి 400 నుండి 450 కిలోమీటర్లు నడిచాడు. ఈ పాదయాత్ర సమయంలో నందీష్ తన వీపుపై పునీత్ చిత్రాన్ని ప్రదర్శించాడు. అంతేకాదు కర్ణాటక రాష్ట్ర జెండాను పట్టుకుని నడిచారు. అతను నవంబర్ 19న తన పాదయాత్రను ప్రారంభించాడు

ఈ సందర్భంగా నందీష్ మాట్లాడుతూ.. తన స్నేహితుల్లో కొద్దీ మంది అనేక సార్లు లోక కళ్యాణం కోసం తిరుపతికి పాదయాత్ర చేయడం తాను చూశానని చెప్పాడు. అయితే తనకు అప్పు అంటే చాలా ఇష్టం.. నా అభిమాన హీరోకి నివాళులర్పించడానికి ఏదోకటి చేయాలనీ భావించాను. అందుకనే ఇలా తిరుపతికి పాదయాత్ర చేపట్టానని చెప్పారు.

బాలనటుడు నుంచి అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పునీత్ .. మంచి డ్యాన్సర్ కూడా. నిర్మాత, సింగర్, బుల్లి తెరపై హోస్ట్ గా కన్నడ ప్రజలను అలరించారు పునీత్.  ఓ వైపు వెండి తెరపై నటుడిగా అలరిస్తూనే.. తనదైన శైలిలో ఎన్నో సామజిక కార్యక్రమాలను కూడా చేపట్టారు. 45 ఉచిత పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాల‌ల‌, 1800 మంది విద్యార్ధుల‌కి ఉచిత విద్యను అందించి ప్రజల మనస్సులో  చిరంజీవిలా నిలిచారు. ఎంతగా పునీత్ ని అభిమానిస్తున్నారంటే.. రోజూ వేలమంది ఆయన సమాధిని దర్శించుకుంటున్నారు. అంతేకాదు.. ఇటీవల ఓ ప్రేమికుల జంట.. బళ్లారి నుంచి కంఠీరవ స్టూడియోలోని పునీత్​ సమాధి వద్ద వెళ్లి.. అక్కడ పెళ్లి  చేసుకున్నారు.

Also Read:PM Modi: ప్రధాని మోడీకి అరుదైన సత్కారం.. ఈల పాటల ట్యూ్న్‌తో పేరు పెట్టిన సంప్రదాయ పల్లెపడుచు!

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..