ఆ ఇద్దరు దర్శకులు అంతే: పీవీపీ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో పీవీపీ ఒకరు. తన నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్‌ ద్వారా అటు పెద్ద హీరోలు, ఇటు చిన్న హీరోలతో ఇప్పటివరకు ఆయన మంచి సినిమాలే తెరకెక్కించారు. కాగా ఇటీవల దర్శకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీవీపీ. సౌత్‌లో ఉన్న ఇద్దరు దర్శకులు.. నిర్మాతలు తమ సెట్‌కు రాకూడదనేది షరతును పెడతారు అని ఆయన చెప్పుకొచ్చారు. తాను వాళ్ల పేర్లు చెప్పనని.. కానీ మన పక్క రాష్ట్రాల్లో వారు ఉన్నారని ఆయన తెలిపారు. […]

ఆ ఇద్దరు దర్శకులు అంతే: పీవీపీ సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 1:02 PM

టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో పీవీపీ ఒకరు. తన నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్‌ ద్వారా అటు పెద్ద హీరోలు, ఇటు చిన్న హీరోలతో ఇప్పటివరకు ఆయన మంచి సినిమాలే తెరకెక్కించారు. కాగా ఇటీవల దర్శకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీవీపీ. సౌత్‌లో ఉన్న ఇద్దరు దర్శకులు.. నిర్మాతలు తమ సెట్‌కు రాకూడదనేది షరతును పెడతారు అని ఆయన చెప్పుకొచ్చారు. తాను వాళ్ల పేర్లు చెప్పనని.. కానీ మన పక్క రాష్ట్రాల్లో వారు ఉన్నారని ఆయన తెలిపారు. అయినా ఇక్కడ దర్శకులకు మంచి డిమాండ్‌ ఉందని.. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు వారితోనే సాధ్యమవుతాయని పీవీపీ చెప్పారు. అందుకే వారిని విమర్శించలేమని.. ఈ విషయంలో నిర్మాతలకు మరోదారి లేదని పేర్కొన్నారు.

ఇక ఈ సందర్భంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘బ్రహ్మోత్సవం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని.. అందుకే పంపిణీ దారులకు తిరిగి డబ్బులు వెనక్కి ఇచ్చామని పీవీపీ గుర్తుచేశారు. ఇక ఈ సినిమా వైఫల్యానికి మహేష్ బాబును కూడా విమర్శించలేమన్నారు పీవీపీ. ఎందుకంటే మహేష్ ఎప్పుడూ దర్శకుల హీరో అని అవసరమైతే ఒక సీన్‌ను పది సార్లు చేస్తుంటారని ప్రశంసలు కురిపించారు. ఇక ఓ సినిమా ఎప్పుడూ దర్శకులపైనే ఆధారపడి ఉంటుందని.. దర్శకుడు అందరితో కలిసి పనిచేస్తే అవుట్‌పుట్‌ బాగా వస్తుందని తెలిపారు. నిర్మాతలు రూ. కోట్లు పెడుతుంటే.. కొందరు దర్శకులు స్క్రిప్టు పూర్తి కాకుండానే సెట్స్‌పైకి వెళ్తుంటారని ఆయన విమర్శించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది రెండు విజయాలను సొంతం చేసుకున్నారు పీవీపీ. మహేష్ 25వ చిత్రం మహర్షికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. అలాగే  అడివి శేషు నటించిన ‘ఎవరు’ చిత్రాన్ని పీవీపీ నిర్మించారు. రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది.