HanuMan Teaser: మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా హను-మాన్ టీజర్.. ప్రశాంత్ వర్మ మార్క్ టేకింగ్..
అ.. సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అనంతరం కల్కి, జాంబిరెడ్డి, అద్భుతం వంటి విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ తాజాగా నిర్మిస్తోన్న మరో చిత్రం 'హను-మాన్'. యువ నటుడు తేజ సజ్జా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు..
అ.. సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అనంతరం కల్కి, జాంబిరెడ్డి, అద్భుతం వంటి విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ తాజాగా నిర్మిస్తోన్న మరో చిత్రం ‘హను-మాన్’. యువ నటుడు తేజ సజ్జా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. జాంబి రెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
హనుమంతుడిని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌ను చూస్తుంటే ఈ సినిమా విలువైన ఓ మణి కోసం సాగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కినట్లు కనిపిస్తోంది. హనుమాన్ భారీ విగ్రహాన్ని చూపించిన విధానం అద్భుతంగా ఉంది. 1.41 నిమిషాల నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది.
ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అబ్బుపరిచే విజువల్స్‌తో ఉన్న ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇక హను-మాన్ అనే టైటిల్‌తోనే సినిమా కథ ఏంటన్న విషయాన్ని ప్రశాంత్ చెప్పకనే చెప్పారు. దేవుడు, మానవుడి మధ్య ఉండే సంబంధాన్ని దర్శకుడు ప్రస్తావించనున్నట్లు అర్థమవుతోంది. గతంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ ఆంజనేయం’ కూడా ఇలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన విషయం తెలిసిందే. మరి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..