విలక్షణ నటుడితో చిరు తనయ ‘ఎక్సేంజ్ ఆఫ్ ఫైర్’
మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల, తన భర్త విష్ణుతో కలిసి నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో సుస్మిత దంపతులు వెబ్‌సిరీస్‌లను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల, తన భర్త విష్ణుతో కలిసి నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో సుస్మిత దంపతులు వెబ్‌సిరీస్‌లను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓ దర్శకుడిని ఫైనల్ చేసుకున్న వీరు.. వెబ్‌సిరీస్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో వీరు ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారట. ఇక ఇందులో సంపత్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఈ సిరీస్‌కు ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. పోలీస్ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సిరీస్‌కి ‘ఎక్సేంజ్ ఆఫ్ ఫైర్’ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా సుస్మిత కొణిదెల ఇప్పటికే ఫ్యాషన్ డిజైనర్‌గా మంచి గుర్తింపును సాధించుకోవడంతో పాటు అవార్డులను సాధించిన విషయం తెలిసిందే.



