సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. పెళ్లికూతురు బంధువుల అమ్మాయి కాదట.. మరెవరంటే!

ఇండియన్ మైఖేల్‌ జాక్సన్‌, మల్టీటాలెంటెడ్‌ ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. పెళ్లికూతురు బంధువుల అమ్మాయి కాదట.. మరెవరంటే!
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 20, 2020 | 1:28 PM

Prabhu Deva Marriage: ఇండియన్ మైఖేల్‌ జాక్సన్‌, మల్టీటాలెంటెడ్‌ ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వరుసకు మేనకోడలు అయ్యే బంధువుల అమ్మాయిని ప్రభుదేవా వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి. అయితే వాటిపై ప్రభుదేవా గానీ.. అతడి టీమ్‌గానీ స్పందించలేదు. అయితే ఓ కోలీవుడ్‌ దినపత్రిక ప్రభుదేవా పెళ్లి గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. (ఆయన జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలే.. చంద్రబాబు ఎమ్మెల్యే రోజా ఫైర్‌

ప్రభుదేవా పెళ్లి సెప్టెంబర్‌లో జరిగిపోయిందని ఆ వార్తా పత్రిక తెలిపింది. ముంబయిలోని ప్రభుదేవా నివాసంలో అతడి వివాహం జరిగిందని, ఆమె ఫిజియోథెరపిస్ట్‌ అని, ప్రస్తుతం వారిద్దరు చెన్నైలో ఉంటున్నట్లు వెల్లడించింది. ప్రభుదేవాకు ఓసారి వెనుక భాగంలో గాయం అయినప్పుడు ఆమె ట్రీట్‌మెంట్ చేసిందని, అప్పటి నుంచి ఈ ఇద్దరు ఒకరికొకరు తెలుసని ఆ దినపత్రిక తెలిపింది. (వెబ్‌ సిరీస్‌ కోసం విజయ్‌ని సంప్రదించిన సుధా కొంగర.. సున్నితంగా తిరస్కరించిన దేవరకొండ..!)

కాగా 1995లో రమాలత్‌ని పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. నయనతారను పెళ్లి చేసుకునేందుకు 2011లో ఆమెకు విడాకులు ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వలన నయన్‌, ప్రభుదేవా పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. ఇక అప్పటి నుంచి ప్రభుదేవా సింగిల్‌గా ఉండగా.. మరోవైపు నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో పడ్డారు. (నిహారిక-చైతన్య వివాహం.. మెగా డాటర్‌కి మాటిచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌..!)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu