నిహారిక-చైతన్య వివాహం.. మెగా డాటర్‌కి మాటిచ్చిన బాబాయ్‌.. రెండు రోజుల ముందే..!

మెగాడాటర్ నిహారిక పెళ్లి చైతన్యతో జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో నిహారిక వివాహం జరగబోతోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:20 pm, Fri, 20 November 20

Niharika marriage Pawan Kalyan: మెగాడాటర్ నిహారిక పెళ్లి చైతన్యతో జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో నిహారిక వివాహం జరగబోతోంది. దానికి సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను నాగబాబు కుటుంబం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఇక ఇటీవలే నిహారిక కూడా అక్కడికి వెళ్లింది. (అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు)

ఇక నిహారిక పెళ్లి కోసం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ రెండు రోజుల ముందు ఉదయ్‌పూర్‌కి వెళ్లనున్నారట. తన పెళ్లి కోసం నిహారిక తన బాబాయ్‌ని పవన్‌ని పర్సనల్‌గా ఇన్వైట్‌ చేసిందట. ఈ క్రమంలో పెళ్లికి రావడమే కాదు, ఆ పనుల్లో తాను భాగం పంచుకుంటానని పవన్‌, నిహారికకు హామీ ఇచ్చారట. ఈ క్రమంలో రెండు రోజులు ముందుగానే పవన్‌ అక్కడికి వెళ్లనున్నారట. అలాగే ఫ్యామిలీ కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నారట. కాగా మరోవైపు నిహారిక పెళ్లి నేపథ్యంలో చిరంజీవి సహా మెగా హీరోలందరూ తమ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే నిహారిక కోసం వారు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. (రష్మిక మందన్నకు అరుదైన గుర్తింపు.. జాతీయ క్రష్‌గా మారిన గీత మేడమ్‌)