వెబ్‌ సిరీస్‌ కోసం విజయ్‌ని సంప్రదించిన సుధా కొంగర.. సున్నితంగా తిరస్కరించిన దేవరకొండ..!

సూర్య నటించిన సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా)తో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు దర్శకురాలు సుధా కొంగర.

  • Updated On - 12:46 pm, Fri, 20 November 20 Edited By:
వెబ్‌ సిరీస్‌ కోసం విజయ్‌ని సంప్రదించిన సుధా కొంగర.. సున్నితంగా తిరస్కరించిన దేవరకొండ..!

Sudha Kongara Vijay: సూర్య నటించిన సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా)తో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు దర్శకురాలు సుధా కొంగర. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదల కాగా.. అన్ని వర్గాల నుంచి పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాను సుధా కొంగర తెరకెక్కించిన తీరు అందరినీ మెప్పిస్తోంది. మణిరత్నం శిష్యురాలిగా సుధా తానేంటో నిరూపించుకున్నారంటూ సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాపై టాలీవుడ్‌ ప్రముఖులు సైతం స్పందించారు. సినిమా అద్భుతం అంటూ సూర్య, సుధాలను కొనియాడారు. వారిలో సెన్సేషనల్‌ నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. (నిహారిక-చైతన్య వివాహం.. మెగా డాటర్‌కి మాటిచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌..!)

కాగా ఇప్పుడు విజయ్‌, సుధాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఓ వెబ్‌సిరీస్‌కి దర్శకత్వం వహిస్తోన్న సుధా.. అందులో ఓ పాత్ర కోసం విజయ్‌ దేవరకొండను సంప్రదించారట. అయితే ఆ ఆఫర్‌ని విజయ్‌ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆమె చెప్పిన పాత్రపై పెద్దగా ఆసక్తిని చూపని దేవరకొండ, తాను చేయలేనని చెప్పారట. దీంతో మరో నటుడిని ఆమె సంప్రదించినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలీదు గానీ.. విజయ్‌కి ఆ పాత్ర నచ్చకనే ఈ ఆఫర్‌ని వదులుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో, ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు విజయ్‌. (అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు)