సెన్సేషనల్ దర్శకుడితో ప్రభాస్.. డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీ..!

అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ డైరక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీని ఆయన తెరకెక్కించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపించాయి. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ దర్శకులు సైతం సందీప్ వంగను మెచ్చుకున్నారు. టాలీవుడ్‌కు మరో వైవిధ్య దర్శకుడు దొరికాడంటూ క్రిటిక్స్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ మూవీ విజయం తరువాత ఆయనతో సినిమాలు తీసేందుకు టాప్ నిర్మాతలు కూడా క్యూ కట్టారు. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు సైతం ఆయన […]

సెన్సేషనల్ దర్శకుడితో ప్రభాస్.. డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 25, 2019 | 7:01 AM

అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ డైరక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీని ఆయన తెరకెక్కించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపించాయి. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ దర్శకులు సైతం సందీప్ వంగను మెచ్చుకున్నారు. టాలీవుడ్‌కు మరో వైవిధ్య దర్శకుడు దొరికాడంటూ క్రిటిక్స్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ మూవీ విజయం తరువాత ఆయనతో సినిమాలు తీసేందుకు టాప్ నిర్మాతలు కూడా క్యూ కట్టారు. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు సైతం ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిని చూపాడు. అంతేకాదు వీరిద్దరి కాంబోపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఆ లోపే బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడకు వెళ్లిపోయాడు సందీప్.

తెలుగులో తాను తెరకెక్కించిన అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డెవిల్ పేరుతో బాలీవుడ్‌లోనే మరో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు సందీప్. ఈ మూవీకి రణ్‌బీర్ కపూర్‌ను ఫైనల్ చేశారు. అయితే కొన్ని కారణాల వలన రణ్‌బీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం ఇప్పుడు సందీప్, ప్రభాస్‌ను కలవడం.. అతడు ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్‌లో బాగా పెరిగిపోయింది. ఆయన అక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆగష్టులో విడుదలైన సాహో ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ.. బాలీవుడ్‌లో మంచి కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలిసిన డార్లింగ్ ఫ్యాన్స్ మరోవైపు ఖుషీలో ఉన్నారు. ప్రభాస్ 21 పేరుతో వారు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ ప్రేమ కథగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇది పూర్తైన వెంటనే సందీప్ వంగతో ప్రభాస్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.