ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు.. మరో క్రేజీ కాంబో షురూ!
రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరికి ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇక ఇలాంటి క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కితే..
KGF Director with Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరికి ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇక ఇలాంటి క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కితే.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. అయితే ఆ తరుణం ఆసన్నం అయ్యేందుకు కాస్త సమయం పట్టనున్నా, ఈ కాంబోలో సినిమా రావడం గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని, అందులో ప్రభాస్ డాన్‌గా కనిపించోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బిల్లాలో ప్రభాస్ డాన్‌గా కనిపించగా, దానికి మించి ఉండేలా ప్రశాంత్ ఓ కథను రాసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా కనిపించనుంది. ఈ రెండింటి తరువాత ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ సెట్స్ మీదకు వెళ్లనున్నారు. మరోవైపు ప్రస్తుతం యశ్ హీరోగా కేజీఎఫ్ సీక్వెల్‌ని తెరకెక్కిస్తోన్న ప్రశాంత్, ఆ తరువాత ఎన్టీఆర్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
Read This Story Also: ఏపీలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు