Prabhas: చెమటతో ఇబ్బందిపడ్డ ప్రభాస్.. తన దుపట్టా అందించిన కృతి సనన్.. రూమర్స్ మళ్లీ మొదలు!
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేదికపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది..
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేదికపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓం రౌత్ దర్శకత్వంలో, రామాయణం కథాంశంగా నిర్మించిన ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ అక్టోబరు 2న అయోధ్యలో సరయూ నది ఒడ్డున విడుదల చేశారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ కనిపించనున్నారు. అయితే ఈ వేదికపై ప్రభాస్, కృతిసనన్ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆదిపురుష్ టీజర్ విడుదల వేదికపై ప్రభాస్ తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. స్టేజ్ పై ఏర్పాటు చేసిన అధిక కెపాసిటీ లైట్ల వేడికి ప్రభాస్ నుదుటన విపరీతంగా చెమటలు పట్టేసాయి. దాంతో చేత్తోనే చెమటను తుడుచుకుంటున్నారు ప్రభాస్. అది గమనించిన కృతి సనన్ తన దుపట్టాతో చెమట తుడుచుకోమంటూ అందించబోయారు.
అయితే ప్రభాస్ సున్నితంగా తిరస్కరించి చేత్తోనే చెమట తుడుచుకున్నారు. ఈ ఆసక్తికర సంఘటన అంతా అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ మరోసారి బాలీవుడ్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు.(Source)
Ok byeee❤?#Prabhas #Kriti in love with this pair? pic.twitter.com/TBWpZnhkKN
— keerthana varma (@VamsiKr94960146) October 3, 2022
Prabhas kriti pair ??>>>>>>> pic.twitter.com/G0tGMJah1q
— Fukrey (@VikramEns) October 3, 2022
#KritiSanon Giving Her Saree To #Prabhas To Sweep His Sweat
Great Bonding ?#Adipurush pic.twitter.com/eTwJKtBONZ
— North Prabhas FC (@NorthPrabhasFC) October 2, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..