AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీకి ప్రభాస్ నిర్మాతల బంపరాఫర్..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి ప్రభాస్ నిర్మాతలు బంపరాఫర్ ఇచ్చారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్‌లో.

పూరీకి ప్రభాస్ నిర్మాతల బంపరాఫర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2020 | 5:48 PM

Share

డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి ప్రభాస్ నిర్మాతలు బంపరాఫర్ ఇచ్చారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్‌లో. ప్రభాస్ హోం ప్రొడక్షన్ హౌస్‌గా చెప్పుకునే యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఇటీవల పూరీని కలిశారట. ఈ సందర్భంగా పూరీ ముందు వారు ఓ ఆఫర్ పెట్టారట. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో వెబ్‌ సిరీస్‌లకు భారీ డిమాండ్ ఉంది. వీటికి క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్‌ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లో నటించేందుకు స్టార్ నటీనటులు సైతం ఆసక్తిని చూపుతున్నారు. అంతేకాదు కొంతమంది టాప్ దర్శకులు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్‌సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పూరీని కలిసిన యూవీ నిర్మాతలు ఓ వెబ్‌ సిరీస్ చేయమని అడిగారట.

ఈ మేరకు మంచి రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేశారట. అంతేకాదు స్క్రిప్ట్‌ మొదలు నటీనటుల ఎంపిక, బడ్జెట్.. ఇలా ప్రతీ విషయంలోనూ నిర్ణయం తీసుకునే అవకాశం పూరీకే ఇచ్చారట. మరి ఈ ఆఫర్‌పై పూరీ ఎలా స్పందించారన్నది తెలియాల్సి ఉంది. అయితే సినిమాలు చేస్తూ సిరీస్‌లను తెరకెక్కించడం పూరీకి కష్టమైన పనేం కాదు. ఎందుకంటే ఓ వైపు సినిమాను తెరకెక్కిస్తూనే మరో సినిమాకు కథను రాసుకునే అలవాటు పూరీకి ఎప్పటినుంచో ఉంది. అంతేకాదు సినిమాల పర్యవేక్షణ కూడా చూస్తుంటారు. ఇలాంటి క్రమంలో ఆయన వెబ్‌ సిరీస్ తెరకెక్కించే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే.

Follow Us
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం